ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న జడ్పీటీసీ కారు

ABN, First Publish Date - 2022-01-13T05:37:15+05:30

మణుగూరు ఎంపీపీ కారం విజయకుమారి, జడ్పీటీసీ పోశం నర్సింహారావు, సమితి సింగారం సర్పంచ్‌ బచ్చల భారతి, టీఆర్‌ఎస్‌ నా యకులు వెంకటేశ్వరరెడ్డికి తృటిలో ప్రాణాపాయం తప్పింది.

క్షత గాత్రుడు జంపయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాహనచోదకుడికి తీవ్ర గాయాలు  

ప్రజాప్రతినిధులకు తృటిలో తప్పిన ప్రాణాపాయం

మణుగూరు, జనవరి 12 : మణుగూరు ఎంపీపీ కారం విజయకుమారి, జడ్పీటీసీ పోశం నర్సింహారావు, సమితి సింగారం సర్పంచ్‌ బచ్చల భారతి, టీఆర్‌ఎస్‌ నా యకులు వెంకటేశ్వరరెడ్డికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. బుధవారం రాత్రి కూనవరం రైల్వే గేట్‌ సమీపంలో జరిగిన ప్రమాదంలో కారులోని ఎయిర్‌బ్యాగులు ఓపెన్‌ కావడంతో వీరు సురక్షితంగా ప్రాణాలతో బయట పడ్డారు. ప్రమాదానికి సంబంధించి స్ధానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ము త్యాలమ్మ నగర్‌ పంచాయతీ పరిధిలో సంక్రాతి పండుగ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల విజేతలకు బహుమతుల ప్రధానోత్సవానికి హాజరయ్యేందుకు ఎంపీపీ కారం విజయకుమారి, సమితి సింగారం సర్పంచ్‌ బచ్చల భారతి, టీఆర్‌ఎస్‌ నాయకులు వెంకటేశ్వరరెడ్డి మణు గూరు జడ్పీటీసీ పోశం నర్సింహారావు కారులో రైల్వే గేట్‌ మీదుగా ముత్యా లమ్మ నగర్‌కు బయలు దేరారు. రైల్వే గేట్‌ సమీపంలో కారు డ్రైవర్‌ ఆటోను తప్పించ బోయి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ద్విచక్ర వాహన చోదకుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడు కూనవరానికి చెందిన ఏనిక జంపయ్యగా గుర్తించారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. కాగా సమయానికి కారు ఏయిర్‌ బ్యాగులు తెరుచుకోవడంతో ప్రజాప్రతినిధులకు ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంలో కారు ధ్వంసం కాగా, ద్విచక్రవాహనం ఎందుకూ పనికిరాకుండా పోయింది.

Updated Date - 2022-01-13T05:37:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising