ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అన్న’కు ఘన నివాళి

ABN, First Publish Date - 2022-01-19T05:09:10+05:30

‘అన్న’కు ఘన నివాళి

ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్న రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇరుజిల్లాల్లో ఎన్టీఆర్‌ వర్థఽంతి కార్యక్రమాలు 

ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలి : మంత్రి పువ్వాడ 

ఖమ్మం కలెక్టరేట్‌, జనవరి 18 : టీడీపీ  వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ 26వ వర్ధంతి సందర్భంగా ఇరు జిల్లాల వ్యాప్తంగా మంగళవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఖమ్మం, కొత్తగూడెంతో పాటు మండల కేంద్రాలు, గ్రామాల్లో ఎన్టీఆర్‌ విగ్రహాలు, చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. పార్టీలు, సంఘాలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పలుచోట్ల రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహించారు. అన్నదానాలు చేశారు. ఆసుపత్రులు, ఆశ్రమాల్లో పండ్లు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఖమ్మం బైపాస్‌రోడ్డులోని ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళురల్పించిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌కు కేంద్రప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. దేశం గర్వించే నేత, తెలుగు జాతికి వన్నెతెచ్చిన ఎన్టీఆర్‌ నాడు తెలంగాణ ప్రజలను నిలువునా దోచుకుంటున్న పటేల్‌ పట్వారీ వ్యవస్థను రద్దుచేసి స్వాతంత్ర్యాన్ని తెచ్చిన మహానీయుడని కీర్తించారు. తాలూకా వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను తెచ్చి ప్రజల వద్దకే పాలనను తెచ్చిన గొప్ప పాలకుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. ఆయన శిష్యుడిగా కేసీఆర్‌ జనరంజక పరిపాలన సాగిస్తున్నాడన్నారు. ఎన్టీఆర్‌ రీతిలోనే కేసీఆర్‌ కూడా పేద, రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. తెలుగు సినీ, రాజకీయ రంగాలు ఉన్నంతకాలం ఎన్టీర్‌ పేరు మారుమోగుతూనే ఉంటుందన్నారు. 




Updated Date - 2022-01-19T05:09:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising