ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో ప్రభుత్వ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి

ABN, First Publish Date - 2022-11-24T00:01:29+05:30

ఖమ్మంజిల్లాలో ప్రభుత్వ విశ్వ విద్యాలయాన్ని వెంటనే ఏర్పాటుచేయాలని పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. పీడీఎస్‌యూ జిల్లా 22వ మహాసభలు బుధవారం వైరాలోని వాసవీ కల్యాణమండపం(జాజిరెడ్డి నగర్‌)లో నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.నాగేశ్వరరావు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆవుల అశోక్‌, పౌరహక్కుల నేత డి.శిరీష హాజరయ్యారు.

వైరాలో పీడీఎస్‌యూ ర్యాలీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు సజిల్లా 22వ మహాసభలు

వైరా, నవంబరు23: ఖమ్మంజిల్లాలో ప్రభుత్వ విశ్వ విద్యాలయాన్ని వెంటనే ఏర్పాటుచేయాలని పీడీఎస్‌యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. పీడీఎస్‌యూ జిల్లా 22వ మహాసభలు బుధవారం వైరాలోని వాసవీ కల్యాణమండపం(జాజిరెడ్డి నగర్‌)లో నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.నాగేశ్వరరావు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆవుల అశోక్‌, పౌరహక్కుల నేత డి.శిరీష హాజరయ్యారు. అసమాన పోరాటాల ద్వారా ఏర్పడిన తెలంగాణలో ప్రభుత్వ అలసత్వం కారణంగా ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి తిరోగమనంలో ఉందని విమర్శిం చారు. ఎందరో విద్యార్థి మేధావులను, లక్షలాది విద్యా ర్థులను అందిస్తున్న జిల్లాలో ప్రభుత్వ విశ్వ విద్యాలయం నేటికీ ఏర్పాటు చేయకపోవడం దుర్మార్గమన్నారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తామని హామీలు ఇచ్చిన పాలకులు తర్వాత విస్మరిం చారని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఖమ్మంజిల్లాలో విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడు కొనేందుకు భవిష్యత్‌లో ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. వైరాలోని ప్రధానరహదారుల్లో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.ఆజాద్‌, వి.వెంకటేష్‌, కోశాధికారి కిరణ్‌, నాయకులు దీపిక, శశి, సతీష్‌, లక్ష్మణ్‌, శివ, వాసు, ఉమేష్‌, జగదీష్‌, గోపి, రమ్య, అనూష పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T00:01:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising