జిల్లాకు రానున్న 23మంది శిక్షణ కలెక్టర్లు
ABN, First Publish Date - 2022-03-06T04:45:50+05:30
క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలుతీరు.. ప్రజలకు ఒనగూరుతున్న ప్రయోజనాలను అధ్యయనం చేసేందుకు ఆలిండియా సివిల్ సర్వీసెస్, మిలటరీ సర్వీసెస్ ఆఫీసర్లు ఖమ్మం జిల్లాకు రానున్నారు.
ఐదు రోజుల పాటు ఖమ్మం జిల్లాలో బస
క్షేత్రస్థాయి పాలనపై అధ్యయనం
ఏర్పాట్లు చేస్తున్న జిల్లా యంత్రాంగం
ఖమ్మంకలెక్టరేట్, మార్చి5: క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలుతీరు.. ప్రజలకు ఒనగూరుతున్న ప్రయోజనాలను అధ్యయనం చేసేందుకు ఆలిండియా సివిల్ సర్వీసెస్, మిలటరీ సర్వీసెస్ ఆఫీసర్లు ఖమ్మం జిల్లాకు రానున్నారు. మొత్తం 23 మంది బృందం సభ్యులు సోమవారం జిల్లాకు రానున్నట్లు సమాచారం. ఈ ఏడాది జనవరి 17 నుంచి హైదరాబాద్‌లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి శిక్షణ సంస్థకు నాలుగు నెలల శిక్షణకోసం వచ్చారు. వీరంతా ఐదు బృందాలుగా కేటాయించి 5గ్రామాలల్లో పర్యటించనున్నారు. మొత్తం 5 రోజులపాటు సివిల్సర్వెంట్లు అధ్యయనం చేయనున్నారు. ఈ బృందాలకు జిల్లా పరిషత్ సీఈవో వింజం వెంకట అప్పారావు, ఖమ్మం నగర మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ గుప్తా నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. మండల స్థాయిలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు నోడల్ అధికారులుగా వ్యవహరించి సివిల్సర్వెంట్లకు దిశానిర్ధేశం చేయను న్నారు. జిల్లాలోని కల్లూరు మండలం కొర్లగూడెం, కామే పల్లి మండలం రామకృష్ణాపురం, కూసుమంచి మండలం గైగొళ్లపల్లి, చింతకాని మండలం అనంత సాగరం, తల్లాడ మండలంలోని తెలగవరం గ్రామాల్లో సివిల్ సర్వెంట్ల బృందాలు అధ్యయనం చేయనున్నారు. ఈనెల 10న 23మంది బృందం సభ్యులు లంకాసాగర్ గ్రామంలో మోడల్ గ్రామాన్ని సందర్శిస్తారు. అక్కడి అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు గ్రామ స్థాయిలో పనులను పరిశీలించి తర్వాత లంకా సాగర్ ప్రాజెక్టును సందర్శించనున్నట్లు తెలిసింది. సివిల్ సర్వెంట్ల రాక కోసం జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
జిల్లాకు కేటాయించిన సివిల్ సర్వెంట్లు వీరే :
1వ బృందం :
తుషార్ఖైన్ 2019 ఢిల్లీ, జగన్కె ఐఆర్ఎస్ 2019 తమిళనాడు, వికాష్కుమార్ ఐపీఎస్ 2018 మేఘాలయ, శివాశీష్కుమార్ ఐఆర్ఏఎస్ 2018 చత్తీస్‌ఘర్, అనుపమ్‌కుమార్ ఐడీఎస్ఈ 2019 జార్కండ్.
2వ బృందం
దర్బాజ్దాస్ ఐపీఎస్ 2019 పశ్చిమ బెంగాల్, రామ్‌సుందర్ ఎం, ఐఎఫ్ఓఎస్ 2019 తమిళనాడు, వైవీఆర్ శశిశేఖర్, ఐటీఎస్ 2020 ఆంధ్రప్రదేశ్, ఏ అశోక్‌సింగ్ ఐడీఎస్ఈ 2019 రాజస్థాన్.
3వ బృందం
రాజామిశ్రా ఐడీఎస్ఈ 2019 ఉత్తరప్రదేశ్, కార్తికేయం ఎం ఐఎఫ్ఓఎస్ 2019 తమిళనాడు, సత్యరాజ్ ఎస్ ఐడీఏఎస్ 2018 తమిళనాడు, రావలే కృషికేష్ ఐపీఎస్ 2019 మహారాష్ట్ర, కేశవ్గోయల్ ఐఆర్ఎస్ 2019 ఢిల్లీ.
4వ బృందం
శుభం నగర్లే ఐఆర్ఏఎస్ 2018 మహారాష్ట్ర, మహ్మద్ నవాజ్ షరీఫుద్దీన్ ఐడీఈఎస్ 2020 జమ్మూకాశ్మీర్, ఆభిమన్యు పౌస్వాల్ ఐపీఎస్ 2018 ఉత్తర ప్రదేశ్, దినేష్‌కుమార్ జి ఐఎఫ్‌వోఎస్ 2019 తమిళనాడు, విభవ్ పొద్దార్ ఐడీఎస్ఈ 2016 ఉత్తర ప్రదేశ్.
5వ బృందం
అర్చిత్ వీరేంద్ర ఐపీఎస్ 2018 మహారాష్ట్ర, సౌరవ్గుప్తా ఐపీఎస్ 2018 రాజస్థాన్, ఆదిత్య మిశ్రా ఐపీఎస్ 2018 మధ్యప్రదేశ్, పుష్కిన్జైన్ ఐపీఎస్ 2017 మధ్యప్రదేశ్.
Updated Date - 2022-03-06T04:45:50+05:30 IST