ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంజాయి కేసులో నలుగురికి పదేళ్ల జైలుశిక్ష

ABN, First Publish Date - 2022-01-12T05:05:44+05:30

కారులో గంజాయి తరలిస్లూ పట్టుబడిన ఒడిశా రాష్ట్రానికి చెందిన నలుగురు నిందితులు కాళీనాథ్‌ మంథల్‌, భగవాన్‌ పంగి, మధుసాత్రో, మూలారాజ్‌ పిళ్ళైలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తీర్పు వెల్లడించిన ఖమ్మం మొదటి అదనపు జిల్లా జడ్జి

నిందితులు ఒడిశా రాష్ట్రానికి చెందిన వారు 


ఖమ్మం : కారులో గంజాయి తరలిస్లూ పట్టుబడిన ఒడిశా రాష్ట్రానికి చెందిన నలుగురు నిందితులు కాళీనాథ్‌ మంథల్‌, భగవాన్‌ పంగి, మధుసాత్రో, మూలారాజ్‌ పిళ్ళైలకు పదేళ్ల జైలుశిక్ష తోపాటు ఒక్కొక్కరికి లక్ష జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖరప్రసాద్‌ మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఖమ్మం దూరల్‌ పోలీసులు 2016 ఫిబ్రవరి 9న ములకలపల్లి క్రాస్‌రోడ్డు దగ్గర తనిఖీలు చేస్తున్న క్రమంలో ఖమ్మం వైపు నుంచి వచ్చిన ఓ కారును ఆపి తనిఖీచేయగా  ఆ కారు డిక్కీలో ఏడు బ్యాగుల్లో ప్యాక్‌ చేసిన 21 పొట్లాల గంజాయిని స్వాధీనం చేసుకుని.. నలుగురుపై కేసు నమోదు చేసి కోర్టులో చార్జీషీట్‌ దాఖలు చేశారు. ఆ కేసును విచారించిన న్యాయమూర్తి నిందితులపై నేరం రుజువుకావడంతో పదేళ్ల జైలు శిక్షవిధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరుపున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కొత్తా వెంకటేశ్వరరావు ఈ కేసును వాదించగా కోర్టు కానిస్టేబుల్‌ లాల్‌ సాహెబ్‌, లైజన్‌ ఆఫీసర్‌ పి.భాస్కరరావు, కె. మోహన్‌రావు, హోంగార్డు యండీ ఆయూబ్‌ సహకరించారు.

Updated Date - 2022-01-12T05:05:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising