ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌కి పరిపాలన చేతకాదు: వైఎస్‌ షర్మిల

ABN, First Publish Date - 2022-01-07T23:14:28+05:30

బంగారు తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ధ్వజమెత్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బంగారు తెలంగాణను ఆత్మహత్యల తెలంగాణగా మార్చారని వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ధ్వజమెత్తారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రైతుల ఆత్మహత్యలపై సీఎం కేసీఆర్ నోరు మెదపడం లేదని దుయ్యబట్టారు. ధరణిలో భూములు గల్లంతు చేశారని ఆరోపించారు. 3 లక్షల మందికి రుణమాఫీ ఇచ్చి.. 30 లక్షల మందికి ఎగ్గొట్టారని తెలిపారు. అన్ని బంధులు బంద్ పెట్టీ రైతుబంధు ఇస్తున్నారని తప్పుబట్టారు. రైతుల ధాన్యంపై తాలు తరుగు అంటూ అన్నీ కటింగ్‌లేనని ఆరోపించారు. కేసీఆర్‌కి పరిపాలన చేతకాదని ఎద్దేవాచేశారు. కేసీఆర్‌ ఒక్క రైతు కుటుంబాన్ని కూడా పరామర్శించలేదని మండిపడ్డారు. బీజేపీ నేతలకు రైతుల ఆత్మహత్యలు కనపడడం లేదా? అని షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ వరి కొనకపోతే మీరు కొంటామని చెప్పొచ్చు కదా అని నిలదీశారు. ఇష్యూ డైవర్ట్ కోసమే బీజేపీ దీక్షలు, ధర్నాలు చేస్తోందని ఆరోపించారు. 317 జీవో పేరుతో బీజేపీ నేతలు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని చెప్పారు. వరి ధాన్యం మొత్తం కొనాల్సిందేనని షర్మిల డిమాండ్ చేశారు.

Updated Date - 2022-01-07T23:14:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising