ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా తల్లి చనిపోయినా కేసీఆర్ పరామర్శించలేదు: తమిళిసై

ABN, First Publish Date - 2022-04-07T21:54:19+05:30

తెలంగాణ గవర్నర్ తమిళిసై భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లి రాజ్ భవన్‌లో చనిపోయినప్పుడు సీఎం కేసీఆర్‌ చూడడానికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: తెలంగాణ గవర్నర్ తమిళిసై భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లి రాజ్ భవన్‌లో చనిపోయినప్పుడు సీఎం కేసీఆర్‌ చూడడానికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యవహారాలపై ప్రదాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. తెలంగాణలో డ్రగ్స్ కేసు, అవినీతిపై మోదీ, అమిత్‌షాలకు నివేదిక ఇచ్చానని తెలిపారు. డ్రగ్స్‌తో యువత నాశనం అవుతున్నారని, ఓ తల్లిగా బాధపడుతూ మోదీకి నివేదిక ఇచ్చానని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ని ఒక అన్నగా భావించానని తెలిపారు. గవర్నర్లతో విభేదించిన ముఖ్యమంత్రులుగా పనిచేసిన కరుణానిధి, జయలలిత, మమత ఆయా రాష్ట్రాలు నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమాలకు పిలిచే వారని గుర్తుచేశారు. తెలంగాణలో ఆస్పత్రుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. యూనివర్సిటీలో 60 శాతం ఖాళీలు ఉన్నాయని, ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తున్నారని తమిళిసై తప్పుబట్టారు. ‘‘ప్రొటోకాల్ ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకునే అధికారం... గవర్నర్‌గా నాకుంది. నేను ఆపని చేయను. తెలంగాణ ప్రభుత్వంపై నాకు ఎలాంటి కోపం లేదు’’ అని తమిళిసై ప్రకటించారు.

Updated Date - 2022-04-07T21:54:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising