ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవర్నర్ వ్యవస్థతో పెట్టుకున్న కేసీఆర్ ఖతం అవుతాడు: రాజాసింగ్‌

ABN, First Publish Date - 2022-04-06T21:51:43+05:30

గవర్నర్ వ్యవస్థతో పెట్టుకున్న సీఎం కేసీఆర్ ఖతం అవుతాడని ఎమ్మెల్యే రాజాసింగ్‌ హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వ తీరుపై ప్రధాని మోదీకి గవర్నర్ ఫిర్యాదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గవర్నర్ వ్యవస్థతో పెట్టుకున్న సీఎం కేసీఆర్ ఖతం అవుతాడని ఎమ్మెల్యే రాజాసింగ్‌ హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వ తీరుపై ప్రధాని మోదీకి గవర్నర్ తమిళసై ఫిర్యాదు చేసి ఉండొచ్చని పేర్కొన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్‌కు ప్రొటోకాల్ కల్పించని సీఎస్ సోమేష్ కుమార్ తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. గవర్నర్ ప్రసంగం లేకుండా బడ్జెట్‌ పెట్టిన ఘనత కేసీఆర్‌దేనని తప్పుబట్టారు. కేసీఆర్ ప్రభుత్వానికి దమ్ముంటే డ్రగ్స్ విక్రయిస్తున్న వారిని ఎన్‌కౌంటర్ చేయాలని రాజాసింగ్‌ సవాల్ విసిరారు. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న సినీ తారలను మంత్రి కేటీఆర్ కాపాడుతున్నాడని ఆరోపించారు. బార్లు, పబ్‌లను టీఆర్ఎస్ నేతలే నడుపుతున్నారని మండిపడ్డారు. డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న బీజేపీ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ని కోరానని రాజాసింగ్‌ తెలిపారు.

Updated Date - 2022-04-06T21:51:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising