ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫాంహౌస్ నుంచి కేసీఆర్ ఫోన్... క్యూ కట్టిన మంత్రులు

ABN, First Publish Date - 2022-03-19T21:17:57+05:30

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో అత్యవసర భేటీ జరుగుతోంది. కేసీఆర్ నుంచి ఫోన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో అత్యవసర భేటీ జరుగుతోంది. కేసీఆర్ నుంచి ఫోన్ రావడంలో మంత్రులందరూ ఫాంహౌస్‌కు క్యూ కట్టారు. ఫాంహౌస్‌ మీటింగ్‌కు రావాలని మంత్రులకు ప్రగతిభవన్ నుంచి ఫోన్‌లు వెళ్లాయి. దీంతో హూటాహుటిగా మంత్రులు ఫాంహౌస్‌కు చేరుకున్నారు. మంత్రులతో పాటు ఉన్నతాధికారులు కూడా సమావేశానికి రావాలని సమాచారం అందించారు.


ఈ సమావేశానికి మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీష్‌రెడ్డితో పాటు అందుబాటులో ఉన్న మంత్రులు రావాలని కేసీఆర్ ఆదేశించారు. అలాగే సీఎస్ సోమేష్‌కుమార్, ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఇటీవల ఫాంహౌస్‌లో కేసీఆర్‌ను వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలిశారు. ఇప్పటికే తెలంగాణ అమలవుతున్న సంక్షేమ పథకాలపై పీకే టీం సర్వే చేసింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఓ వైపు ముందస్తు ఎన్నికల ప్రచారం మరోవైపు రాష్ట్రానికి పీకే టీం రావడం.. ఈ పరిణామాల మధ్య కేసీఆర్‌తో మంత్రుల అత్యవసర భేటీకి ప్రధాన్యత సంతరించుకుంది. 

Updated Date - 2022-03-19T21:17:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising