ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశాన్ని ముంచేందుకు BRS పేరుతో KCR కొత్త నాటకాలు: విజయశాంతి

ABN, First Publish Date - 2022-04-30T03:24:47+05:30

దేశాన్ని ముంచేందుకు BRS పేరుతో KCR కొత్త నాటకాలు: విజయశాంతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌కు తెలంగాణ ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చారని, ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో కొత్త నాటకాలు షురూ చేశాడని ఆమె ఆక్షేపించారు. పచ్చి అబద్ధాలు, మోసాలతో టీఆర్ఎస్ ప్లీనరీ కొనసాగిందని విమర్శించారు. తెలంగాణను నిండా ముంచేసి అప్పుల పాల్జేసిన కేసీఆర్ ఇక దేశాన్ని ముంచేందుకు కొత్త డ్రామాలాడుతున్న‌ాడని విజయశాంతి మండిపడ్డారు. రాములమ్మ సోషల్ మీడియాలో పోస్టు యథాతథంగా..


''టీఆర్ఎస్‌కు తెలంగాణ ప్రజలు వీఆర్ఎస్ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో కొత్త నాటకాలు షురూ చేసిండు. పచ్చి అబద్ధాలు, మోసాలతో టీఆర్ఎస్ ప్లీనరీ కొనసాగింది. తెలంగాణను నిండా ముంచేసి అప్పుల పాల్జేసిన కేసీఆర్ ఇక దేశాన్ని ముంచేందుకు కొత్త డ్రామాలాడుతున్న‌డు. తెలంగాణ ధనిక రాష్ట్రమని అంటున్న కేసీఆర్... ఉద్యోగులకు విడతల వారీగా జీతాలు ఇచ్చే దుస్థితి ఎందుకొచ్చిందో... పెన్షనర్లకు బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలి. కరెంటు చార్జీలు పెంచారు... మళ్లీ ఆర్టీసీ చార్జీలు ఎందుకు పెంచుతున్నరు? అధికారులు నిబద్ధతతో పనిచేయాలి. కేసీఆర్ ఎంఐఎంను నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతున్న‌డు. ఒక టీఆరెస్ ఎమ్మెల్సీ బాధ్యత గల సీఐని పట్టుకుని ప‌చ్చి బూతులు తిట్టాడు. పోలీసులంటే బానిసలనుకున్నారా? రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసిన కేసీఆర్... కాళేశ్వరంలో వేల కోట్లు దోచుకుని త‌న కుటుంబ ఆస్తుల్ని లక్షల కోట్లకు పెంచుకున్న‌డు. పార్టీ ఆస్తులతో పాటు తన కుటుంబ ఆస్తులు కూడా వెల్లడిస్తే బాగుండేది. రాష్ట్ర మంత్రులపై అవినీతి ఆరోపణలు ఉన్నయి. కోర్టు విచారణల్లో ఎప్పటికైనా తప్పక నిజం బయటకి వస్తుంది.'' అని విజయశాంతి అన్నారు.



Updated Date - 2022-04-30T03:24:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising