ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీకి కేసీఆర్ లేఖ

ABN, First Publish Date - 2022-01-13T00:12:13+05:30

ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఎరువుల ధరలను తగ్గించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ధరల భారాన్ని రైతులపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఎరువుల ధరలను తగ్గించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ధరల భారాన్ని రైతులపై మోపేందుకు ప్రభుత్వం ఎంచుకుందని, పెట్రో ధరల పెరుగుదల రైతులకు ఇబ్బందిగా మారిందన్నారు. ఎరువుల ధరలు తగ్గించేంతవరకు పోరాటం చేస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ప్రకటించారు. వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం దుర్మార్గమన్నారు. వ్యవసాయ ఖర్చులు రెట్టింపు చేయడం దుర్మార్గమన్నారు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామని ప్రకటించారని, అమలులో మాత్రం రైతాంగం నడ్డి విరుస్తున్నారని లేఖలో కేసీఆర్‌ విమర్శించారు.


రైతు ప్రయోజనాలకు ప్రతికూలంగా ఉన్న కొన్ని విషయాలను మీ దృష్టికి తీసుకువస్తున్నానని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆరు సంవత్సరాలలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్నదని, ఈ విషయాన్ని ఫిబ్రవరి  2016లో ప్రకటించిందనే విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికీ 5 సంవత్సరాలు గడిచిన నిర్దిష్ట నిర్మాణత్మక కార్యక్రమం ప్రారంభించలేదన్నారు. ఐదు ఏళ్లల్లో ఇన్‌పుట్ ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గి రైతులను ఇబ్బంది పెడుతున్నాయన్నారు. ఆరు సంవత్సరాలుగా పెరుగుతున్న ఎరువు ధరలు కళ్ళకు కడుతున్నవన్నారు. మ్యురియేట్ ఆఫ్ ఫోటాస్ ధరలు 50 శాతం, 100 శాతం కంటే ఎక్కువ  పెరగడం విచారకరమని ఆ లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. 




Updated Date - 2022-01-13T00:12:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising