కేసీఆర్ కుటుంబం.. బీజేపీ నేతలే టార్గెట్
ABN, First Publish Date - 2022-12-15T02:45:55+05:30
కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త కొనుగోలు సునీల్ కార్యాలయంపై దాడులు జరిపిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు.. ముగ్గురిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు.
‘తెలంగాణ గళం’, ‘భారత యువకుడు’
పేర్లతో యూట్యూబ్ చానల్, ఫేస్బుక్ పేజీ
ఫొటోలను మార్ఫింగ్ చేసి.. అసభ్య పోస్టులు
కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ ఆఫీసుపై దాడి..
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త కొనుగోలు సునీల్ కార్యాలయంపై దాడులు జరిపిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు.. ముగ్గురిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు-- మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ప్రధాని మోదీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్ తదితరులే టార్గెట్‌గా సోషల్ మీడియాలో ఫొటోలను మార్ఫింగ్ చేస్తూ.. అసభ్య పోస్టులు పెడుతున్నారంటూ వారిపై అభియోగాలు మోపారు. వారి నుంచి 10 ల్యాప్టా్ప/డె్స్కటా్పలు, మొబైల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ జాయింట్ కమిషనర్ గజరావ్ భూపాల్ వివరాలు వెల్లడించారు.
‘‘కనుగోలు సునీల్ మాదాపూర్‌లో ‘మైండ్ షేర్ యునైటెడ్ ఫౌండేషన్’ పేరుతో ఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ కార్యాలయం నుంచి ‘తెలంగాణ గళం’, ‘భారత యువకుడు’ పేర్లతో యూట్యూబ్ చానల్, ఫేస్బుక్ పేజీలను నిర్వహిస్తున్నారు. టీవీల్లో వచ్చే వాణిజ్య ప్రకటనల్లోని కంటెంట్‌ను అసభ్యకర మార్ఫింగ్ చేస్తున్నారు. ఆ ప్రకటనల పాత్రధారుల ముఖాలను కేసీఆర్, కేటీఆర్, కవిత, ప్రధాని మోదీ, సంజయ్, అరవింద్ ముఖాలను అతికిస్తున్నారు. వారి పరువుకు భంగం కలిగేలా ఆ వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఈ చర్యలపై ఇప్పటికే సీసీఎ్సతో పాటు.. మార్కెట్, చాంద్రాయణగుట్ట, రాంగోపాల్‌పేట, అంబర్‌పేట పోలీ్సస్టేషన్లలో ఐదు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి’’ అని ఆయన వివరించారు. ఈ కేసుల దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలను సేకరించిన సీసీఎస్ బృందాలు.. మాదాపూర్‌లోని సునీల్ కార్యాలయంపై దాడిచేసినట్లు వివరించారు. అక్కడ పనిచేస్తున్న శ్రీప్రతాప్, శశాంక్, ఇషాన్శర్మలను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వీరంతా సునీల్ ఆదేశాల మేరకు పనిచేస్తున్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. కనుగోలు సునీల్ కాంగ్రెస్ వ్యూహకర్త కావడం వల్లే ఆయన బృందాన్ని అరెస్టు చేశారా? అని విలేకరులు ప్రశ్నించగా.. జాయింట్ సీపీ సమాధానాన్ని దాటవేశారు.
వాణిజ్య ప్రకటన వీడియోలను వారు ఎలా మార్ఫింగ్ చేశారన్నది పోలీసులు కొన్ని ఉదాహరణలతో వివరించారు.
టీ యాడ్‌లో.. టీ ప్లేసులో లిక్కర్
ఒక బ్రాండ్ టీ గురించి టీవీలో ప్రకటన వస్తోంది. తులసితో కూడిన ఆ టీ తాగితే.. అనారోగ్యానికి తక్కువ గురవుతారు అనేది కంటెంట్. ఆ ప్రకటనను మార్చేసి టీ స్థానంలో లిక్కర్‌ను పెట్టారు. అందులో నటించిన నటీనటుల ముఖాలు మార్ఫింగ్ చేసి కవిత, కేసీఆర్, కేటీఆర్‌ల ఫొటోలు పెట్టి, ఈ లిక్కర్ తాగితే అనారోగ్యానికి తక్కువ గురవుతారు అంటూ వారు వీడియోను పోస్టు చేశారని వివరించారు.
అలానే టెంపర్ సినిమాలోని కొన్ని డైలాగ్‌లను మిక్స్‌చేసి సంజయ్, కిషన్‌రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్ ఫొటోలను మార్ఫింగ్ చేసి మోసగాళ్లుగా చిత్రీకరిస్తూ వీడియోను పోస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Updated Date - 2022-12-15T02:45:56+05:30 IST