ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KCR : ఢిల్లీలో కేసీఆర్‌ సర్వదర్శనం

ABN, First Publish Date - 2022-12-16T03:04:34+05:30

ఢిల్లీలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అందరూ కలిసేందుకు గురువారం తుగ్లక్‌రోడ్డులోని అధికారిక నివాసంలో సర్వదర్శనం ఏర్పాటు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎంను కలిసేందుకు అందరికీ అవకాశం

మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 దాకా .. కార్యకర్తల క్యూ.. మరో రెండ్రోజులు అక్కడే

ముఖ్యమంత్రిని కలిసిన ఎంపీ అసదుద్దీన్‌.. కుమార్తె వివాహానికి ఆహ్వానం

న్యూఢిల్లీ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అందరూ కలిసేందుకు గురువారం తుగ్లక్‌రోడ్డులోని అధికారిక నివాసంలో సర్వదర్శనం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఆయన్ను అందరూ కలిసేందుకు వీలు కల్పించారు. దీంతో సీఎం నివాసం జనసందోహంగా మారింది. బీఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభమయ్యాక అక్కడే ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు వివిధ సంఘాల నేతలు కేసీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో ఫొటోలు దిగారు. ఈ సర్వదర్శనం రాత్రి ఎనిమిది గంటల దాకా కొనసాగింది. ఈ సందర్భంగా ‘కేసీఆర్‌ జిందాబాద్‌’, ’జై బీఆర్‌ఎస్‌’, ‘అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ వంటి నినాదాలు మిన్నంటాయి. మజ్లిస్‌ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ గురువారం కేసీఆర్‌ను కలిశారు. తమ కూతురు పెళ్లికి రావాల్సిందిగా వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంప్రారంభమైన సందర్భంగా కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

వారిద్దరు కొద్దిసేపు జాతీయ రాజకీయాలపై కూడా చర్చించినట్లు తెలిసింది. తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్‌, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌.. కేసీఆర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. కాగా భారత రాజ్యాంగ నిర్మాత అబేండ్కర్‌ ఫొటోను కరెన్సీ నోట్లపై ముంద్రించాలని కోరుతూ సీఏపీఎ్‌సఎస్‌ జాతీయ అధ్యక్షుడు జెరిపోతులు పరశురాం, సలహాదారు ఆళ్ల రామకృష్ణ వినతి పత్రం సమర్పించారు. ఈ విషయంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ రాయాలని కోరారు. నాలుగు రోజులుగా ఢిల్లీలోనే ఉన్న కేసీఆర్‌, మరో రెండ్రోజులు హస్తినలోనే ఉండనున్నారు.

Updated Date - 2022-12-16T03:04:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising