ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌ దళిత ద్వేషి: మందకృష్ణ

ABN, First Publish Date - 2022-02-20T00:34:58+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళిత ద్వేషి అని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిర్యాలగూడ: ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళిత ద్వేషి అని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. రాజ్యాంగ పరిరక్షణ అంశంపై శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ కేసీఆర్‌ మనసులో దళితులపై పెరిగిన ద్వేషమే రాజ్యాంగాన్ని మార్చాలనే విధంగా రూపం దాల్చిందన్నారు. దళిత, బహుజనులకు అంబేడ్కర్‌ రాజ్యాంగం కల్పించిన హక్కులను మొత్తంగా రద్దు చేసి దొరలకు పెత్తనం కట్టబెట్టేందుకు కల్వకుంట్ల రాజ్యాంగం తెస్తారేమోనని విమర్శించారు. ఎన్ని ఉద్యమాలు, బలిదానాలు చేసినా అంబేడ్కర్‌ రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్‌ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కేసీఆర్‌ చెప్పారని మందకృష్ణ గుర్తు చేశారు. 


Updated Date - 2022-02-20T00:34:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising