ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రంపై అసహనం వ్యక్తం చేసిన కేసీఆర్

ABN, First Publish Date - 2022-01-10T00:03:51+05:30

పలు ప్రాజెక్ట్‌లకు కేంద్రం అనుమతులు రాకపోవడంపై సీఎం కేసీఆర్‌ అసహనం వ్యక్తం చేశారు. కేంద్రానికి అన్ని వివరాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: పలు ప్రాజెక్ట్‌లకు కేంద్రం అనుమతులు రాకపోవడంపై సీఎం కేసీఆర్‌ అసహనం వ్యక్తం చేశారు. కేంద్రానికి అన్ని వివరాలు, అదనపు సమాచారం అందించి.. త్వరితగతిన అనుమతులు పొందాలని అధికారులకు కేసీఆర్‌ ఆదేశించారు. కరోనా పట్ల ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. కరోనాపై ప్రజలు భయాందోళన చెందొద్దని చెప్పారు. ఆరోగ్య, ఇరిగేషన్‌, రోడ్ల భవనాల శాఖ అధికారులతో కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 15 ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని సూచించారు. కరోనా లక్షణాలుంటే వెంటనే టెస్టులు చేయించుకోవాలన్నారు. రేపు వృద్ధులు, ఫ్రెంట్‌లైన్‌ వర్కర్లకు బూస్టర్‌ డోస్‌ వేయించుకోవాలని కేసీఆర్ సూచించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ సంక్రాంతి వేడుకలు జరుపుకోవాలని చెప్పారు. సచివాలయం, పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ భవనాల.. నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని కేసీఆర్ ఆదేశించారు. 

Updated Date - 2022-01-10T00:03:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising