ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌కు కొత్త కాన్వాయ్‌

ABN, First Publish Date - 2022-07-24T02:11:37+05:30

తెలంగాణ సీఎం కేసీఆర్‌ (CM KCR)కు కొత్త కాన్వాయ్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ వాహనాలకు భద్రతాపరమైన పనుల్లో భాగంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గన్నవరం: తెలంగాణ సీఎం కేసీఆర్‌ (CM KCR)కు కొత్త కాన్వాయ్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ వాహనాలకు భద్రతాపరమైన పనుల్లో భాగంగా బుల్లెట్‌ప్రూఫ్‌ (Bulletproof) ఏర్పాటు పనులు.. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపునేనిగూడెంలో జరుగుతున్నాయి. టీఎస్‌ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఎనిమిది ఫార్చ్యునర్‌ కార్లు హైదరాబాద్‌ Hyderabad నుంచి కార్గో విమానంలో రెండు నెలల క్రితం గన్నవరం విమానాశ్రయానికి వచ్చాయి. మూడో రోజుల క్రితం మరో పది కార్లు వచ్చాయి. మొత్తం 18 వాహనాలు ఇక్కడికి వచ్చాయి. వాటిని విమానాశ్రయం నుంచి వీరపనేనిగూడెంలో ఉన్న ఓ ప్రముఖ కంపెనీకి తరలించారు. ఇక్కడ ఆరు వాహనాలకు ప్రస్తుతం బుల్లెట్‌ప్రూఫ్‌ను అమర్చే పనులు జరుగుతున్నాయి. వాహనాలకు డోర్లు, బాయినెట్‌, సీట్లు తొలగించి పనులు చేస్తున్నారు. బుల్లెట్‌ ప్రూప్‌ కాన్వాయ్‌ని తయారు చేసేందుకు కేరళ నుంచి పలువురు నైపుణ్యం కలిగిన ఇంజనీర్లను తీసుకొచ్చినట్టు సమాచారం. ప్రముఖల కాన్వాయ్‌లకు బుల్లెట్‌ ప్రూఫ్‌ను అమర్చే కంపెనీలు జార్ఖండ్‌లో ఉన్నాయి. ఆ తర్వాత ఏపీలోని కృష్ణా జిల్లాలో ఉండడం విశేషం. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ పనులు జరుగుతున్నాయి. ఒక్కసారిగా టీఎస్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ కలిగిన వాహనాలు రావడంతో తెలంగాణ రాజకీయ నేత ఎవరో వస్తున్నారన్న హడావుడి వీరపునేనిగూడెంలో కనిపించింది. తర్వాత విషయం తెలుసుకొని జనం పక్కకు వెళ్లిపోయారు.

Updated Date - 2022-07-24T02:11:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising