ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణకు కేసీఆర్‌ వెన్నుపోటు: కిషన్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-10-17T09:38:04+05:30

తమకు పదవులు అక్కర్లేదని, తెలంగాణ వస్తే కాపలా కుక్కలా ఉంటానని చెప్పిన కేసీఆర్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మునుగోడు రూరల్‌/సంస్థాన్‌ నారాయణపురం/హైదరాబాద్‌, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): తమకు పదవులు అక్కర్లేదని, తెలంగాణ వస్తే కాపలా కుక్కలా ఉంటానని చెప్పిన కేసీఆర్‌.. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తానే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. బీజేపీతోనే తెలంగాణ ఆకాంక్ష నెరవేరుతుందని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా మునుగోడు మండలం కిష్టాపురం, పలివెల గ్రామాల్లో కిషన్‌రెడ్డి మాట్లాడారు.  ఆనాడు రజాకార్లను కారం ముద్దలు, రోకలి బండలతో తరిమికొట్టారని.. అదే స్ఫూర్తితో కేసీఆర్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. దేశాన్ని దోచుకునేందుకు కేసీఆర్‌ బీఆర్‌ఎ్‌సను స్థాపించారని విమర్శించారు. తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన వారిని పార్టీ నుంచి బయటకి పంపారని, ఇప్పుడు ఆ పార్టీలోనే తెలంగాణ పేరు లేకుండా చేయడం దారుణమన్నారు. కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మంగళవారం నుంచి మునుగోడులో ప్రచారం చేయనున్నారు.



3 వేల పింఛన్‌ ఇస్తామనలేదు: రఘునందన్‌

దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో గెలిస్తే రూ.3వేల పింఛన్‌ ఇస్తామని తాము చెప్పలేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. ఆదివారం యాదాద్రి జిల్లా సంస్థాన్‌ నారాయణపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దుబ్బాక, హుజూరాబాద్‌లో గెలిస్తే రూ.3వేల పింఛన్‌ ఇస్తామని బీజేపీ నేతలు హామీ ఇచ్చారని హరీశ్‌ మీడియాతో చెప్పడం దుష్ప్రచారమన్నారు.  

Updated Date - 2022-10-17T09:38:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising