ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాతీయ ఎజెండాపై కేసీఆర్‌ గురి

ABN, First Publish Date - 2022-05-18T08:00:21+05:30

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జాతీయస్థాయికి విస్తరించి, కింగ్‌మేకర్‌గా నిలవాలని యోచిస్తున్న టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు జాతీయస్థాయి అజెండాను తయారుచేసే పనిలో తలమునకలయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • జలవిధానం రూపకల్పనలో ముఖ్యమంత్రి తలమునకలు 
  • రాత్రి 11 గంటల వరకు చర్చలు 

హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జాతీయస్థాయికి విస్తరించి, కింగ్‌మేకర్‌గా నిలవాలని యోచిస్తున్న  టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు జాతీయస్థాయి అజెండాను తయారుచేసే పనిలో తలమునకలయ్యారు. అందులో భాగంగా తొలుత జాతీయ జలవిధానం రూపొందించడంపై కసరత్తు చేస్తున్నారు. ప్రగతి భవన్‌లో మంగళవారం విస్తృతస్థాయి వర్క్‌షా్‌పను నిర్వహించారు. ఈ సదస్సుకు కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) పూర్వ చైౖర్మన్‌ సయ్యద్‌ మసూద్‌ హుస్సేన్‌ హాజరయ్యారు. దేశవ్యాప్తంగా వివిధ బేసిన్‌లలో పారుతున్న నదులు, వాటి నీటి లభ్యత, వినియోగం, వాటిపై ఆధారపడి కట్టిన ప్రాజెక్టులపై చర్చలు జరిగాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి 11 గంటల దాకా విస్తృతంగా చర్చించారు. బుధవారం కూడా చర్చలు కొనసాగనున్నాయి. జాతీయ జలవిధానంపై ఏ వైఖరి తీసుకుంటే బాగుంటుందనే దానిపై సమీక్షించారు. బీజేపీ, కాంగ్రె‌స్‌లకు ప్రత్యామ్నాయంగా జాతీయ రాజకీయాల్లో ప్రభావవంతమైన పాత్రను పోషించాలని కేసీఆర్‌ చాలా రోజులుగా భావిస్తున్నారు. అందులో భాగంగానే దేశంలోని పలువురు ప్రముఖులతో ఆయన భేటీ అవుతున్నారు. 


Updated Date - 2022-05-18T08:00:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising