ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బతుకమ్మ చీరలకు యారన్‌ సబ్సీడీ అందించాలి

ABN, First Publish Date - 2022-10-04T06:29:11+05:30

సిరిసిల్లలో తయారు చేసిన బతుకమ్మ చీరలను తయారు చేసిన కార్మికులకు రావాల్సిన 10 శాతం యారన్‌ సబ్సిడీ అందించి కార్మికులను ఆదుకోవాలని సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ డిమాండ్‌ చేశారు.

సిరిసిల్ల చేనేత జౌళీశాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- చేనేత జౌళీశాఖ ఎదుట కార్మికుల ధర్నా

సిరిసిల్ల రూరల్‌, అక్టోబరు 3 : సిరిసిల్లలో తయారు చేసిన బతుకమ్మ చీరలను తయారు చేసిన కార్మికులకు రావాల్సిన 10 శాతం యారన్‌ సబ్సిడీ అందించి కార్మికులను ఆదుకోవాలని సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌లోని చేనేత జౌళీశాఖ కార్యా లయం ఎదుట సోమవారం సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాయకులు, కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏడీ సాగర్‌కు వినతిపత్రం అందించగా పదిశాతం యారన్‌ సబ్సిడీలను మంగళవారం ఉదయం వరకు కార్మికుల ఖాతాల్లో జమచేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రమేష్‌, కోడం రమణలు మాట్లాడుతూ కార్మికుల ఖాతాల్లో డబ్బులను జమ చేయకుంటే 4వ తేదీ నుంచి  కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టెక్స్‌టైల్‌ పార్క్‌ యూనియన్‌ అధ్యక్షుడు కూచన శంకర్‌, జిల్లా నాయకులు నక్క దేవదాస్‌, గుండు రమేష్‌, శ్రీపతి మునీందర్‌, గోరంతల రాజమల్లు, బెజిగం సురేష్‌, అంజనే యులు, గడ్డం ఐలయ్య, గడ్డం రాజశేఖర్‌, సందుపట్ల పోచమల్లు, రమేష్‌, రాజు, గణేష్‌ కార్మికులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-04T06:29:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising