ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా సంఘటిత శక్తి ఓ ఆయుధం

ABN, First Publish Date - 2022-06-30T05:39:10+05:30

మహిళా సంఘటిత శక్తి ఓ ఆయుధం అని దాన్ని మంచి కోసం వాడాలని మంత్రి కొప్పు ఈశ్వర్‌ అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఈశ్వర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రామ, మండల స్ధాయిలో సంఘాలు బలోపేతం చేయాలి

ఐకేపీ వీవోఏల ఉద్యోగుల సంఘ ఆత్మీయ సదస్సులో మంత్రి ఈశ్వర్‌

జగిత్యాల అర్బన్‌, జూన్‌ 29: మహిళా సంఘటిత శక్తి ఓ ఆయుధం అని దాన్ని మంచి కోసం వాడాలని మంత్రి కొప్పు ఈశ్వర్‌ అన్నారు.  జిల్లా కేంద్రంలోని స్థానిక టౌన్‌ హాల్‌లో నిర్వహించిన ఐకేపీ వీవోఏల ఉద్యోగుల సంఘ జిల్లా శాఖ ఆత్మీయ సదస్సుకు ఆయన ముఖ్య అతి ఽథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపైనా, సీఎం కేసీఆర్‌పైన ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తుంటే వీవోఏలు గ్రామాల్లో నిజం చెప్పి, ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌ కు అండగా నిలవాలన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది మహిళా సంఘా ల్లో చైతన్యం వచ్చినట్లయితే ఆ మహిళా శక్తి అజేయమైందని, దాన్ని మంచి ప్రభుత్వం, నాయకుని గెలుపుకోసం వాడాలన్నారు. ఆ ఆయుఽధం తిరిగి కేసీఆర్‌ను అధికారంలోకి తీసుకురావడానికి వినియోగించాలని కో రారు. ఆరోజు ఉన్న నాయకులకు రాజకీయాలు తప్ప, అభివృద్ధి మీద సోయి లేదన్నారు. మనంగానీ, మన ప్రాంతంగానీ, గొప్పగా ముందుకు వెళ్లాలంటే, ప్రజలకు మెరుగైన సేవలందాలంటే మనమందరం కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ పక్షాన, కేసీఆర్‌ నేతృత్వంలో ఆగ్రామంలో, సంఘాల్లో పనిచేయాలన్నారు. గ్రామ, మండల స్ధాయిలో సంఘాలు బలోపేతం కావాలని, ఆ దిశగా వీవోఏలు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. 

Updated Date - 2022-06-30T05:39:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising