ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్యాంకు రుణాలతో మహిళలు ఆర్ధికంగా ఎదగాలి

ABN, First Publish Date - 2022-06-25T07:03:54+05:30

బ్యాంకు రుణాలతో మహిళలు ఆర్ధికంగా ఎదగాలని జిల్లా అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత అన్నారు.

చెక్కులను అందజేస్తున్న అదనపు కలెక్టర్‌ లత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా అదనపు కలెక్టర్‌ లత 

జగిత్యాల అర్బన్‌, జూన్‌ 24: బ్యాంకు రుణాలతో మహిళలు ఆర్ధికంగా ఎదగాలని జిల్లా అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎల్‌జీ గార్డెన్‌లో జిల్లాలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌ల ఆధ్వర్యంలో మహిళా సం ఘాలకు రుణమేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ము ఖ్య అతిథిగా హాజరైన లత మాట్లాడుతూ జిల్లాలోని మహిళా సంఘాల కు పెద్దఎత్తున బ్యాంకుల వారీగా లక్ష నుంచి సుమారు రూ.20లక్షల వరకు బ్యాంకు లింకేజీ రుణం అందించామని, ఈ రుణాలను సద్విని యోగం చేసుకొని మహిళలు ఆర్ధికంగా ఎదగాలని సూచించారు. మహి ళల ఆర్థికాభ్యున్నతికి పెద్ద ఎత్తున రుణాలు అందిస్తున్న జిల్లాలోని ఎస్‌బీ ఐ బ్యాంకులను లత అభినందించారు. అనంతరం ఎస్‌బీఐ డిప్యూటీ జన రల్‌ మేనేజర్‌ నటరాజన్‌ మాట్లాడుతూ మహిళలకు ఎప్పుడైనా రుణాలు అందించడానికి ఎస్‌బీఐ కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని, తీసుకున్న రు ణాలను సకాలంలో తిరిగి చెల్లించి మహిళలు బ్యాంకులకు సహకరిం చడంతో పాటు రుణాల చెల్లింపులో ఆదర్శంగా నిలవాలన్నారు. జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని మహిళలకు వివిధ యూనిట్లకు రుణాలు అందిస్తామని, సంఘ సభ్యులకు వ్యక్తిగత రుణాలు సైతం ఆసక్తి గల వారికి అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బ్యాంక్‌ లింకేజీలో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఏపీఎం, టీఎంసీ, సీసీఎస్‌, సీవోఎస్‌, వీవోఏఎస్‌, ఆర్‌పీలకు ప్రశంసాపత్రాలను బ్యాంకుల తరుపున అందించారు. ఈ కార్యక్రమంలో  ఎస్‌బీఐ బ్యాంక్‌ మేనేజర్‌ కాశీ రాం, తేజేశ్వర్‌రావు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రమ్యతో పాటు ఆ యా మండలాల ఎస్‌బీఐ బ్యాంకు మేనేజర్లు, మండలాల సెర్ప్‌ సిబ్బంది,  స్వశక్తి సంఘాల బాధ్యులు తదితరులున్నారు.

Updated Date - 2022-06-25T07:03:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising