ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం సభలో నిరసన వ్యక్తం చేస్తాం

ABN, First Publish Date - 2022-12-07T00:36:31+05:30

వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు కరీంనగర్‌ పార్లమెంటు నియోజకవర్గంలోని అనేక పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు పెద్ద ఎత్తున జగిత్యాలకు తరలివచ్చి సీఎం కేసీఆర్‌ సభలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు.

మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేములవాడ, డిసెంబరు 6: వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు కరీంనగర్‌ పార్లమెంటు నియోజకవర్గంలోని అనేక పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు పెద్ద ఎత్తున జగిత్యాలకు తరలివచ్చి సీఎం కేసీఆర్‌ సభలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేయాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన వేములవాడలో విలేకరులతో మాట్లాడారు. 2014 సంవత్సరం నుంచి ఇప్పటివరకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు ప్రజలు, కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన తెలపాలని కోరారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానానికి ఏటా వందకోట్ల రూపాయలు నిధులను కేటాయిస్తామని స్వామి వారికే శఠగోపం పెట్టాడన్నారు. ఈ విషయమై బ్రాహ్మణ సంఘం నాయకులు, భక్తులు నిరసన తెలపాలని కోరారు. మిడ్‌మా నేరు ముంపు గ్రామాల సమస్యలు ఇప్పటికీ పరిష్కరించలేదన్నారు. వేము లవాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ వేము లవాడలో వంద కోట్ల కుంభకోణం జరిగినట్లు చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ నిరూపించాలని, అవసరమైతే ఇందుకోసం ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని అన్నారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, పిల్లి కనకయ్య, పాత సత్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:36:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising