ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌యూలో అన్ని సౌకర్యాలతో స్టేడియం నిర్మిస్తాం

ABN, First Publish Date - 2022-12-16T23:54:33+05:30

శాతవాహన యూనివర్సిటీ పరిధిలో అన్ని సౌకర్యాలతో మల్టిపుల్‌ స్టేడియం నిర్మించనున్నట్లు వీసీ ప్రొఫెసర్‌ ఎస్‌ మల్లేష్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని యూనివర్సిటీ మైదానంలో శాతవాహన యూనివర్సిటీస్థాయి అంతర డిగ్రీ కళాశాలల అథ్లెటిక్స్‌ పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు.

అథ్లెటిక్స్‌ పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్‌ స్పోర్ట్స్‌, డిసెంబరు 16: శాతవాహన యూనివర్సిటీ పరిధిలో అన్ని సౌకర్యాలతో మల్టిపుల్‌ స్టేడియం నిర్మించనున్నట్లు వీసీ ప్రొఫెసర్‌ ఎస్‌ మల్లేష్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని యూనివర్సిటీ మైదానంలో శాతవాహన యూనివర్సిటీస్థాయి అంతర డిగ్రీ కళాశాలల అథ్లెటిక్స్‌ పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యూనివర్సిటీ స్థాయి క్రీడాకారులకు సకల సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అంతర విశ్వవిద్యాలయాల స్థాయిలో విజేతలుగా నిలిచే క్రీడాకారులకు ప్రోత్సాహకాలను అందజేస్తామన్నారు. ఖేలో ఇండియా అనుమతించిన పిదప యూనివర్సిటీలో స్టేడియం నిర్మిస్తామన్నారు. అనంతరం యూనివర్సిటీ స్థాయిలోని వివిధ డిగ్రీ కళాశాలల నుంచి హాజరైన క్రీడాకారులకు అథ్లెటిక్స్‌ పోటీలను నిర్వహించారు. యూనివర్సిటీ పరిధిలోని దాదాపు 25 డిగ్రీ కళాశాలల నుంచి మహిళా క్రీడాకారులు పాల్గొని ప్రతిభచాటారు. పోటీల్లో విజేతలుగా నిలిచి పతకాలు సాధించిన క్రీడాకారులు జనవరి 9 నుంచి 12వ తేదీ వరకు చెన్నైలోని తమిళనాడు కాలేజ్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో జరగనున్న అంతర విశ్వవిద్యాలయాల పోటీలకు ఎంపిక చేశారు. 17వ తేదీన పురుషులకు అథ్లెటిక్స్‌ పోటీలను నిర్వహించనున్నారు. యూనివర్సిటీ స్పోర్ట్స్‌ బోర్డు కార్యదర్శి నజీముద్దీన్‌ మునావర్‌, యూనివర్సిటీ ఫిజికల్‌ డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌, వివిధ కళాశాలల ఫిజికల్‌ డైరెక్టర్లు పాల్గొన్నారు.

ఈ నెల 12, 13 తేదీల్లో శాతవాహన యూనివర్సిటీలో నిర్వహించిన ఈ పోటీల్లో ట్రైబల్‌ కళాశాల విద్యార్థులు ప్రతిభచాటి ద్వితీయ స్థానం సాధించారని కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ ఎండీ సర్వర్‌ తెలిపారు. లాగే ఈ నెల 23 నుంచి 27 వరకు తమిళనాడులోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో జరగనున్న దక్షిణ భారత అంతర యూనివర్సిటీ వాలీబాల్‌ పోటీలకు కళాశాల క్రీడాకారులు ఎం సాంబశివరావు, సీహెచ్‌ సందీప్‌, పి సదువలిలు ఎంపికయ్యారని పేర్కొన్నారు.

Updated Date - 2022-12-16T23:54:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising