ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

17వ రోజుకు వీఆర్‌ఏల నిరాహార దీక్షలు

ABN, First Publish Date - 2022-08-11T06:26:59+05:30

సమస్యల పరిష్కారం కోసం వీఆర్‌ఏల జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏలు చేపట్టిన నిరాహార దీక్షలు బుధవారానికి 17వ రోజుకు చేరుకున్నాయి.

సిరిసిల్ల శిబిరంలో నిరసన తెలపుతున్న వీఆర్‌ఏలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల టౌన్‌, ఆగస్టు 10: సమస్యల పరిష్కారం కోసం వీఆర్‌ఏల జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వీఆర్‌ఏలు చేపట్టిన నిరాహార దీక్షలు బుధవారానికి 17వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వీఆర్‌ఏల సంఘం సిరిసిల్ల డివిజన్‌ అధ్యక్షుడు రాధాశంకర్‌ మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా వీఆర్‌ఏలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. వీఆర్‌ఏలకు పే స్కేల్‌ జీవోను విడదల చేయాలని,  అర్హులకు పదోన్నతులు కల్పించాలని, 55 సంవత్సరాలు నిండిన వారి కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో   వీఆర్‌ఏల సంఘం డివిజన్‌ ఉపాధ్యక్షుడు సిరిగిరి నవీన్‌కుమార్‌, వీఆర్‌ఏలు మాదాసు సంతోష్‌, క్యారం రమేష్‌,  కాసు రామచంద్రం, రేషం సరిత, తుమ్మ సత్తయ్య, బాలరాజు, మొండయ్య లక్ష్మీనారాయణ, దేవయ్య, కవిత, చంద్రకళ, మమత, సునీత, అజంత, మల్లేశం పాల్గొన్నారు.

Updated Date - 2022-08-11T06:26:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising