ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంటులో టీఎస్‌ఆర్‌ఈడీసీ చైర్మన్‌ పర్యటన

ABN, First Publish Date - 2022-10-01T04:50:09+05:30

ఎన్టీపీసీ ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టును శుక్రవారం తెలంగాణ స్టేట్‌ రిన్యూవబుల్‌ ఎనర్టీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(టీఎస్‌ఆర్‌ఈడీసీ) చైర్మన్‌ వై.సతీష్‌రెడ్డి సందర్శించారు.

సతీష్‌రెడ్డికి సోలార్‌ ప్రాజెక్టు వివరాలు తెలియజేస్తున్న ఎన్టీపీసీ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జ్యోతినగర్‌, సెప్టెంబరు 30 : ఎన్టీపీసీ ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టును శుక్రవారం తెలంగాణ స్టేట్‌ రిన్యూవబుల్‌ ఎనర్టీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(టీఎస్‌ఆర్‌ఈడీసీ) చైర్మన్‌ వై.సతీష్‌రెడ్డి సందర్శించారు. ఎన్టీపీసీ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో దేశంలోనే అతిపెద్ద 100 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టును గత నెలలో ప్రారంభించిన నేపథ్యంలో ప్రాజెక్టు విశేషాలను తెలుసుకునేదుకు టీఎస్‌ఆర్‌ఈడీసీ చైర్మన్‌ సతీష్‌ రెడ్డి ఇక్కడికి వచ్చారు. ఎన్టీపీసీ జీఎం(రిన్యూవబుల్‌ ఎనర్జీ) వేముల అనిల్‌కుమార్‌, ఇతర అధికారులు రాజ్‌కుమార్‌, ప్రేంరెడ్డిలు ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టుకు సంబంధిం చిన సాంకేతిక అంశాలు, నిర్మాణం జరిగిన తీరు, విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా తదితర విషయాలను సతీష్‌రెడ్డికి వివరించారు. ఎన్టీపీసీ ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టు విజయ వంతంగా నడుస్తున్న క్రమంలో తెలంగాణలోని నీటి పారుదల ప్రాజెక్టులలో ఇలాం టి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి విద్యుత్‌ ప్లాంట్లను నెలకొల్పేందుకు ప్రభు త్వం ప్రయత్నిస్తోంది. కాళేశ్వరం, శ్రీరాంసాగర్‌ తదితర జలాశయాల్లో ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టులను నెలకొల్పే విషయంలో సతీష్‌రెడ్డి ఎన్టీపీసీలో పర్యటించినట్లు సమాచారం. టీఎస్‌ఆర్‌ఈడీసీ చైర్మన్‌తో పాటు ప్రాజెక్టు డైరెక్టర్‌ హరిగోపాలాచారి ఇతర అధికారులు పర్యటనలో పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-01T04:50:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising