ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీపీసీ బూడిద పైప్‌లైన్‌ సర్వేను అడ్డుకున్న గ్రామస్థులు

ABN, First Publish Date - 2022-06-26T06:22:59+05:30

తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు(ఎన్టీపీ సీ)కు సంబంధించిన బూడిద పైపులై న్‌ సర్వే పనులను శనివారం మల్కా పూర్‌ గ్రామస్థులు అడ్డుకున్నారు.

అధికారులను అడ్డుకుంటున్న గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జ్యోతినగర్‌, జూన్‌ 25 : తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు(ఎన్టీపీ సీ)కు సంబంధించిన బూడిద పైపులై న్‌ సర్వే పనులను శనివారం మల్కా పూర్‌ గ్రామస్థులు అడ్డుకున్నారు. ని ర్మాణంలో ఉన్న తెలంగాణ ఎన్టీపీసీ ప్రాజెక్టునుంచి వచ్చే బూడిదన ఓసీపీ 4 క్వారీకి తరలించేందుకు మల్కాపూ ర్‌ శివారు ద్వారా పైప్‌లైను నిర్మాణాని కి ఎన్టీపీసీ ప్రణాళికలు చేసింది. ఈ విషయంలో గతంలో ఒకటి, రెండుసా ర్లు పైప్‌లైను నిర్మాణ కోసం రెవెన్యూ, ఎన్టీపీసీ అధికారులు సర్వే చేసేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో మరోసారి శనివారం రామగుండం రెవెన్యూ, ఎన్టీపీసీ అధికారులు సర్వే చేసేందుకు మ ల్కాపూర్‌కు రాగా, గ్రామస్తులు అడ్డుకున్నారు. రాజకీయాలకు అతీ తంగా గ్రామానికి చెందిన అన్ని పార్టీ ల నాయకులు, ప్రజలు, రైతులు సర్వే పనులను అడ్డుకున్నారు.బూడిద పైపు లైన్‌ నిర్మాణం కోసం ఎట్టి పరిస్థితుల్లో తమ భూములను ఇవ్వమని మల్కా పూర్‌ గ్రామస్తులు ముక్తకంఠంతో స్ప ష్టంచేశారు. పైప్‌లైన్‌ విషయం హై కోర్టు విచారణలో ఉందని, భూములు ఇవ్వమని గతంలోనే తాము ఎన్టీపీసీ, రెవెన్యూ అధికారులకు చెప్పామని వారు తెలిపారు. మరోసారి సర్వే చేసేందుకు రావద్దని స్పష్టం చేశారు. దీంతో రెవెన్యూ, ఎన్టీపీసీ అధికారులు వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో 5వ డివిజన్‌ కార్పొరే టర్‌ కల్వచర్ల కృష్ణవేణి, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి.రహీం, గ్రామస్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-26T06:22:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising