ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమం

ABN, First Publish Date - 2022-01-20T06:32:47+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమం చేపడుతున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు అన్నారు.

పెద్దపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట అందోళన చేస్తున్న కార్మికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లి రూరల్‌, జనవరి 19 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య ఉద్యమం చేపడుతున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు అన్నారు. బుధవారం పెద్దపల్లి మండల పరిషత్‌ కార్యాలయం ఎదు ట సీఐటీయూ గ్రామ పంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అనంతరం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎంపీడీవో రాజుకు వినతిపత్రం మర్పించారు. ఈసందర్భంగా సీఐటీ యూ జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాల మూలంగా దేశంలో దుర్భర పరిస్థి తులు నెలకోన్నాయని. ఈ విధనాలను వెంటన విరమించు కుని దేశానికి ఉపయోగపడే విధానాలను అమలు చేయా లని డిమాండ్‌ చేశారు. అందుకు కార్మికులు, రైతులు, ప్రజ లందరూ ఐక్యంగా ఉద్యమించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 11వ పీఆర్‌సీ ప్రకారం వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికి వేతనాలు పెం చిందని, కానీ గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు వేతనం పెంచకపోవడం అన్యాయమన్నారు. కరోనా నేపథ్యం లో ప్రాణాలకు తెగించి శ్రమిస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు సన్మా నాలు, సత్కరాలు, శాలువాలు కప్పగం తప్ప వేతనాలు పెంచకపోవడం వివక్షనేనని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయితిలో పనిచేస్తున్న కార్మికులందరికి 11వ పీఆర్‌సి ప్రకారం నెలకు రూ.15,600 పెంచాలని, మల్లీపర్పస్‌ విధానాన్ని రద్దు చేయాలని, కారోబార్‌, బిల్‌ కలె క్టర్‌కు స్పెషల్‌ స్టేటస్‌ ఇవ్వాలని శాశ్వత విభాగాల్లో పనిచేస్తున్న వారంద రిని ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే రాబోవు రోజుల్లో కార్మిక సంఘాలను కలుపుకోని గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమిస్తామని హెచ్చ రించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కనుకయ్య. ఎండి ఖాజా, మల్లే శం, శ్రీనివాస్‌, కాంతమ్మ, రాజయ్య, బాలరాజు, రాజేశం, గోపయ్య, శ్రీకాం త్‌, పరుశరాములు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T06:32:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising