ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మలుపు తిరుగుతున్న హత్య కేసు

ABN, First Publish Date - 2022-01-22T05:47:02+05:30

జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్‌ నగర్‌కు చెందిన జగన్నాథం నాగేశ్వర్‌రావు, రాంబాబు, రమేష్‌ల హ త్యల కేసు మలుపు తిరుగుతోంది.

గ్రామంలో పోలసుల పికెటింగ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యాపారలీవాదేవీలే కారణమా..

గత నెలలో అగ్రహారం వద్ద గొడవపై పోలీసు ఆరా

జగిత్యాల రూరల్‌, జనవరి 21: జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్‌ నగర్‌కు చెందిన జగన్నాథం నాగేశ్వర్‌రావు, రాంబాబు, రమేష్‌ల హ త్యల కేసు మలుపు తిరుగుతోంది. జిల్లా కేంద్రంలో జరిగిన మూడు హత్యలకు వ్యాపార లావాదేవీలే కారణమన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తు న్నారు. మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతోనే ఈ ముగ్గురినీ హత్య చేసినట్లు అన్ని టీవీ చానళ్లు, వార్త పత్రికల్లోనూ మొదట ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా కొత్త అంశం పోలీసుల విచారణలో తెరపైకి వస్తోంది. మృతుడు జగన్నాథం నాగేశ్వర్‌రావు, ఆయన కుమారుల హత్య లకు ప్రధాన కారణం సెప్టిక్‌ ట్యాంక్‌ వాహన వ్యాపారంగా పోలీసులు అనుమానిస్తున్నారు. నాగేశ్వర్‌రావు వడ్డీ వ్యాపారం చేస్తుండడంతో పాటు కొన్నేళ్లుగా సెప్టిక్‌ ట్యాంక్‌ వా హన వ్యాపారం చేస్తున్నాడు. సెప్టిక్‌ ట్యాంక్‌ క్లీన్‌ చేసే వ్యాపారంలో  కొన్ని రోజులుగా జగిత్యాల, సిరిసిల్ల వ్యాపారుల మద్య విభేదాలున్న ట్లు ప్రచారం జరుగుతోంది. గత నెల 17వ తేదీన సిరిసిల్ల జిల్లాలోని అగ్రహారం వద్ద నాగేశ్వర్‌రావుకు సిరిసిల్ల వ్యాపారుల కు మద్య గొడవ జరగడం, నాగేశ్వర్‌రావు కారును సైతం ధ్వంసం చేసినట్లు తెలు స్తోంది. ఈ వ్యవహారంపై సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌లో ఇరు వర్గాలు ఫి ర్యాదులు చేసుకున్నారు. అగ్రహారం వద్ద జరిగిన కారణంగానే నాగేశ్వర్‌రావు, అతని కుమారులను హత్య చేసారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పథకం ప్రకారం సిరిసిల్లలోనే స్కెచ్‌ వే సి సంఘటనకు పూనుకొని ఉంటారా... అన్న వివరాలను పోలీసులు సేకరి స్తున్నారు. పోలీసుల దర్యాప్తులో నిజానిజాలు వెల్లడి కావాల్సి ఉంది.

పోలీసుల అదుపులో పది మంది అనుమానితులు...

టీఆర్‌ నగర్‌గ్రామంలో నిర్వహిస్తున్న వడ్డీవ్యాపారం, రియల్‌ఎస్టేట్‌ దందాల పైన పోలీసులు దృష్టిసారించి విచారణ కొనసాగిస్తున్నారు.  హత్యలకు సంబంధించి 10 మంది అనుమానితులను పోలీసులు అ దుపులోకి తీసుకొని పలు కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతు న్నారు. ఇప్పటికే ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి  దర్యా ప్తు చేస్తున్నారు. 

ప్రేమించిపెళ్లి.. అంతలోనే అనంతలోకాలకు...

ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురైన రమేష్‌ భార్య రోధిస్తున్న తీరు అందరినీ కలిచివేసింది. రమేష్‌, సౌజన్యలు మూడేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కడవరకు తోడుంటానని అంతలోనే దూరం అయ్యావా అంటూ సౌజన్య కన్నీటిపర్యంతమైంది. 

గృహ ప్రవేశం జరిగిన ఐదు రోజులకే...

జగిత్యాలలో హత్యకు గురైన రాంబాబు ఇటీవల ఇళ్లు నిర్మించుకున్నా డు. ఐదు రోజుల క్రితమే గృహ ప్రవేశం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో రాంబాబు టీఆర్‌నగర్‌లోని సంఘ భవనంలో జరిగిన సంఘటనలో హ త్యకు గురయ్యారు. దీంతో రాంబాబు భార్య పిల్లలు తీవ్రంగా రోధిస్తున్నారు.

పోలీస్‌ బందోబస్తు మధ్య మృతుల అంత్యక్రియలు

టీఆర్‌నగర్‌లో గురువారం హత్యకు గురైన నాగేశ్వర్‌ రావు, రాంబాబు, రమేష్‌ మృతులకు పోలీస్‌ బందోబస్తు మధ్య అంత్యక్రియలు నిర్వహిం చారు. మృతులకు జగిత్యాల ఏరియా అస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహిం చిన అనంతరం టీఆర్‌నగర్‌లోని నాగేశ్వర్‌రావు ఇంటి వద్ద నుంచి ఊరే గింపుతో తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామ శివారులో గల టీఆర్‌నగర్‌ శ్మశానవాటికలో ముగ్గురు అంత్యక్రియలు నిర్వహించారు.  జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్‌, జగిత్యాల రూరల్‌ సీఐ కృష్ణకుమార్‌ల ఆధ్వర్యం లో 50 మంది పోలీ సులతో భారీ పికెటింగ్‌ ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.


Updated Date - 2022-01-22T05:47:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising