ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TRS vs Congress: గులాబీ-హస్తం నేతల మద్య మాటల తూటాలు..

ABN, First Publish Date - 2022-09-22T17:06:04+05:30

తెలంగాణలో జాతీయ రమదారి విస్తరణపై రాజకీయ దుమారం రేగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్ (Karimnagar): తెలంగాణలో జాతీయ రమదారి విస్తరణపై రాజకీయ దుమారం రేగుతోంది. గులాబీ, హస్తం నేతల మద్య మాటల తూటాలు పేలుతున్నాయి. జగిత్యాల, కరీంనగర్, వరంగల్ జాతీయ రహదారి విస్తరణపై టీఆర్ఎస్ (TRS) - కాంగ్రెస్ (Congress) ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఎన్‌హెచ్ 563 4లైన్ అలైన్‌మెంట్‌పై  రెండు పార్టీలు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఉన్న రహదారిలోనే మరో రెండు వరుసల లైన్లు నిర్మించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. మాజీ ఎంపీ వినోద్ కుమార్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అలైన్‌మెంట్‌ను మారుస్తున్నారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. పచ్చని పొలాలను నాశనం చేస్తూ మెడికల్ కాలేజీ కోసం అలైన్‌మెంట్ మార్చారని మండిపడ్డారు.


మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను గులాబీ నేతలు ఖండించారు. అసలు జాతీయ రహదారి తెచ్చిందే వినోద్ కుమార్ అని కరీంనగర్ మేయర్ సునీల్ రావు అన్నారు. బైపాస్‌లను అనుసంధానం చేసేలా అలైన్‌మెంట్ రూపకల్పన జరిగిందని తెలిపారు. జాతీయ రహదారులు పట్టణాల నుంచి వెళితే ప్రజలకు ఇబ్బందులు వస్తాయన్నారు. ప్రజల రక్షణను దృష్టిలో పెట్టుకునే అలైన్‌మెంట్ రూపొందిందని అన్నారు. పొన్నం ప్రభాకర్ ఓ ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అని, ఆయనకు ఏమీ తెలియదని అన్నారు. వినోద్ కుమార్‌ను విమర్శించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని పొన్నం చూస్తున్నారని సునీల్ రావు మండిపడ్డారు.

Updated Date - 2022-09-22T17:06:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising