నిరుపేద కుటుంబాలకు అండగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం
ABN, First Publish Date - 2022-12-03T00:25:34+05:30
నిరుపేద కుటుంబాలకు టీఆర్‌ఎస్ ప్రభు త్వం అండగా నిలుస్తోందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొ న్నారు. గుల్లకోట, జగదేవ్‌పేట గ్రామాలలో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు.
- సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
వెల్గటూర్, డిసెంబరు 2: నిరుపేద కుటుంబాలకు టీఆర్‌ఎస్ ప్రభు త్వం అండగా నిలుస్తోందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొ న్నారు. గుల్లకోట, జగదేవ్‌పేట గ్రామాలలో పలు అభివృద్ధి పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం 37 మంది లబ్దిదారులకు కల్యాణల క్ష్మి, షాదీ ముభారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ కాంలో అభివృద్ధి చెంది దేశంలో నెంబర్ వన్ స్థానానికి చేరిందన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రా ష్ట్రంలో 48 లక్షల మందికి పిఛన్లు ఇస్తున్నామని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కల్యాణలక్ష్మి, షాదీ ముభారక్, ఆసరా పింఛన్లు, రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి ఉచిత కరెంటు వంటి పథకా లు అమలు చేస్తున్నది తెలంగాణ రాష్ట్రం మాత్రమే అన్నారు. వివిధ కుల సంఘాల అభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తెలంగా ణలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక విపక్షాలు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. వైఎస్ షర్మిల బీజేపీ వది లిన బాణమని పేర్కొన్నారు. రూ.82 వేల కోట్లు ఖర్చుతో కాలేశ్వరం ప్రా జెక్టు నిర్మించి 45 లక్షల ఎకరాలకు నీరందిస్తే లక్ష కోట్ల అవినీతి జరిగిం దని విపక్షాలు విమర్శించడం సరికాదన్నారు. తెలంగాణలో అవినీతి జరి గిందనే సింగిల్ ఎజెండాగా కాంగ్రెస్, బీజేపీ, వైఎస్‌టీపీ అధ్యక్షులు రేవం త్‌రెడ్డి, బండి సంజయ్, వైఎస్ షర్మిలలు విష ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం లోని మోదీ ప్రభుత్వం కోటి కోట్ల రూపాయల అప్పు చేసిందని దుయ్యబట్టారు. తెలంగాణలో అభివృద్ధి జరగలేదని ప్రచారం చేయడం దుర్మార్గమైన చర్యన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు రమేష్, ఉదయ్‌కుమార్, ప్రజా ప్రతినిధులు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-03T00:25:36+05:30 IST