ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెడికల్‌ కళాశాలకు నిధుల కేటాయింపుపై కోర్టుకు..

ABN, First Publish Date - 2022-01-18T05:53:50+05:30

సింగరేణి యాజమాన్యం మెడికల్‌ కళాశాలకు కేటాయించిన నిధులు వాపసు తీసుకోకపోతే కోర్టుకు వెళతామని హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి యాజమాన్యాన్ని హెచ్చరించారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న రియాజ్‌ అహ్మద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కార్మికుల సొమ్మును దోచుకుంటున్న ప్రభుత్వం 

- హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి రియాజ్‌ అహ్మద్‌

గోదావరిఖని, జనవరి 17: సింగరేణి యాజమాన్యం మెడికల్‌ కళాశాలకు కేటాయించిన నిధులు వాపసు తీసుకోకపోతే కోర్టుకు వెళతామని హెచ్‌ఎంఎస్‌ ప్రధాన కార్యదర్శి యాజమాన్యాన్ని హెచ్చరించారు. సోమవారం స్థానిక ప్రెస్‌క్ల్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ ప్రభుత్వానికి రూ.500కోట్లు దానం చేసిందని చెబుతుందని, యాజమాన్యానికి ఆ హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. ప్రభుత్వం కూడా సింగరేణిలో షేర్‌ హోల్డర్‌ అని, రూ.500కోట్లు డొనేషన్‌ ఇచ్చామని సంస్థ సీఎండీ చెప్పడం విడ్డూరంగా ఉందని, దానం చేయ డం అంటే తుఫాను వచ్చినప్పుడు కానీ, కరోనా విపత్తు సమయంలో కానీ చేస్తే అది దానం అవుతుంది తప్ప మెడికల్‌ కళాశాలకు ఇవ్వడం దానం కాదని, ప్రభుత్వమే మెడికల్‌ కళాశాలకు నిధులు ఇవ్వాలని డి మాండ్‌ చేశారు. ప్రభుత్వం మరో నినాదానికి తెరలేపిందని, మెయింటనె న్స్‌ పేర రూ.150నుంచి రూ.200కోట్లు సింగరేణి సంస్థ భరించాలని ఆదే శాలు ఇవ్వడాన్ని సీఎండీ వ్యతిరేకిస్తున్నారని, సీఎండీ ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. రూ.500కోట్లను కూడా వాపసు తీసుకోవాలని, రూ.500కోట్లతో నూతనంగా ఐదు బొగ్గు గనులను ప్రారంభించవచ్చునని, నూతనంగా బొగ్గుగనులు వస్తే యువతకు ఉపాధితో పాటు ఉద్యో గ అవకాశాలు వస్తాయన్నారు. ప్రభుత్వం ఇల్లందులో ఆర్‌టీసీ డిపో ఏ ర్పాటుకు నిధులు ఇవ్వాలని ప్రతిపాదనలు చేయడం శోచనీయమని, ఇప్పటికే సింగరేణి సొమ్మును ప్రభుత్వం దోచుకుతింటోందని, సీఎస్‌ఆర్‌ నిధులను ఎమ్మెల్యేలకు ఇస్తుందని, ప్రభావిత గ్రామాలను కాకుండా హైదరాబాద్‌, ఇతర ప్రాంతాల్లో ఆ నిధులను ఎలా ఖర్చు చేస్తారని ఆయన ప్రశ్నించారు. సింగరేణివ్యాప్తంగా ఉన్న ఏరియా ఆసుపత్రుల్లో కనీస వస తులు లేవని, మొదటి యాజమాన్యం కార్మికులకు వసతులు కల్పించాల ని, ప్రమాదాల్లో చనిపోయిన కార్మిక కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తే పట్టించుకోని యాజమాన్యం ఇలా దుబార ఖర్చులు చేయడం సరికాదన్నారు. సింగరేణిలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయని, కరోనా వచ్చిన వారికి లీవులు ఇవ్వ కుండా మేనేజర్లు కొరివి పెడుతున్నారన్నారు. ఈ విలేకరుల సమావేశం లో తోటు వేణు, బోగనిరి సమ్మయ్య, రమేష్‌, ఆరీఫ్‌, రామస్వామి, రాం చందర్‌, మల్లయ్య, రాజన్న పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-18T05:53:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising