ఈ కమిషనర్ మాకొద్దు..
ABN, First Publish Date - 2022-08-04T06:33:37+05:30
జగిత్యాల మున్సిపాలిటీలో పాలన గతి తప్పుతోంది. కింది స్థాయి సిబ్బందిపై పైస్థాయి అధికారులు తమ ప్రతాపాన్ని చూపిస్తుండడంతో చేసేదేమీ లేక సిబ్బంది సెలవులో వెళ్లడంతో అభివృద్ధి కుంటుపడుతోంది.
- జగిత్యాల బల్దియా కమిషనర్‌పై కౌన్సిలర్ల ఆగ్రహం
జగిత్యాల టౌన్, ఆగస్టు 3: జగిత్యాల మున్సిపాలిటీలో పాలన గతి తప్పుతోంది. కింది స్థాయి సిబ్బందిపై పైస్థాయి అధికారులు తమ ప్రతాపాన్ని చూపిస్తుండడంతో చేసేదేమీ లేక సిబ్బంది సెలవులో వెళ్లడంతో అభివృద్ధి కుంటుపడుతోంది. బల్దియా చైర్‌పర్సన్ సమీక్ష సమావేశాలు నిర్వహించినప్పటికీ అదే సాకుతో మళ్లీమళ్లీ అదే స్థాయిలో మున్సిపల్ కమిషనర్ సైతం రాత్రి 10 గంటల వరకు సమీక్షలు నిర్వహించడంతో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది సైతం సెలవుల్లో వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ముచ్చటించుకుంటున్నారు. కొన్ని రోజులుగా పలువురు సిబ్బంది వరుసగా సెలవులో వెళ్లడం చూస్తుంటే అసలు జగిత్యాల బల్దియాలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదని కౌన్సిలర్లే చర్చించుకోవడం కొసమెరుపు.
- ప్రభుత్వానికి సరెండర్ చేయాలని ఎమ్మెల్యేకు మొర?
జగిత్యాల బల్దియా కమిషనర్‌గా పనిచేస్తున్న స్వరూపరాణి పనితీరు బాగా లేదని ఆరోపిస్తూ జగిత్యాల బల్దియా కార్యాలయంలో చైర్‌పర్సన్ బోగ శ్రావణి ఆధ్వర్యంలో వైస్‌చైర్మన్ గోలి శ్రీనివాస్‌తో పాటు 30 మంది కౌన్సిలర్లు బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు సమాచారం. అంతేకా కుండా కమిషనర్ ఏయే సిబ్బందిని ఎలా ఇబ్బందు లకు గురి చేశారో అనే వివరాలను కూడా బుధవారం తన చాంబర్‌లో అన్ని విభాగాల సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వివరాలు సేకరించినట్లు తెలిసింది. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను క్యాంపు కార్యాలయం లో చైర్‌పర్సన్ శ్రావణి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు మర్యా దపూర్వకంగా కలిసి బల్దియా జరుగుతున్న విష యాలను వివరించారు. తక్షణమే కమిషనర్‌ను ప్రభుత్వానికి సరేండర్ చేయాలని ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నట్లు కౌన్సిలర్లతో పాటు చైర్‌పర్సన్ శ్రావణి పేర్కొన్నారు. కమిషనర్ భవితవ్యం ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటుందని అనుకుంటున్నారు. కమిషన ర్ స్వరూపరాణి జగిత్యాల బల్దియాలో కొనసాగేనా, లేక బదిలీ అయ్యేనా అని చర్చలు మొదలయ్యాయి.
Updated Date - 2022-08-04T06:33:37+05:30 IST