ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లీబిడ్డల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయం

ABN, First Publish Date - 2022-08-20T05:02:25+05:30

తల్లీబిడ్డల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు.

కేసీఆర్‌ కిట్‌ పంపిణీ చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు

- మంత్రి గంగుల కమలాకర్‌

సుభాష్‌నగర్‌, ఆగస్టు 19: తల్లీబిడ్డల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా ఆసుపత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని బాలింతలను కలిసి వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రజనీ అనే మహిళ కవల పిల్లలకు జన్మనివ్వడంతో ఆమెకు కేసీఆర్‌ కిట్లతోపాటు ఐదు వేల రూపాయలను మంత్రి బహుమతిగా అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపుమేరకు జిల్లాలో వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. మాతా శిశు ఆరోగ్యకేంద్రంలో అందుతున్న సేవలపై బాలింతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు పేదలపక్షాన కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్‌ఎస్‌ పాలనలో విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. రాబోయే కాలంలో వైద్యానికి మరిన్ని నిధులు కేటాయిస్తామని, వైద్య సిబ్బందిని పెంచి నిరుపేదలకు మరింత నాణ్యమైన వైద్యం అందిస్తామన్నారు. ప్రసవాలకోసం మాతా శిశు కేంద్రానికి ఎక్కువ సంఖ్యలో వస్తున్నారని, దాంతో ప్రస్తుతానికి ఇది సరిపోవడంలేదని, దీనిని మరింతగా విస్తరించి, వైద్య సిబ్బందిని నియమిస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌,  మేయర్‌ వై సునీల్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, డీఎంహెచ్‌వో డాక్టర్‌ జువైరియా, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రత్నమాల, ఆర్‌ఎంవో జ్యోతి, అలీం పాల్గొన్నారు.


Updated Date - 2022-08-20T05:02:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising