ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ రైతాంగ పోరాటం స్ఫూర్తిగా తరలిరావాలి

ABN, First Publish Date - 2022-04-26T05:54:31+05:30

తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఉమ్మడి జిల్లాలోని రైతంగం, అన్నివర్గాల ప్రజలు రైతు సంఘర్షణ యాత్రలో భాగంగా వరంగల్‌లో నిర్వహించే రాహుల్‌గాంధీ సభకు తరలిరావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్‌ రెడ్డి, పాల్గొన్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  రాహుల్‌గాంధీ సభను విజయవంతం చేయాలి

  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి


కరీంనగర్‌ అర్బన్‌, ఏప్రిల్‌ 25: తెలంగాణ రైతాంగ పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఉమ్మడి జిల్లాలోని రైతంగం, అన్నివర్గాల ప్రజలు రైతు సంఘర్షణ యాత్రలో భాగంగా వరంగల్‌లో నిర్వహించే రాహుల్‌గాంధీ సభకు తరలిరావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కరీంనగర్‌లోని కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేక రులతో మాట్లాడారు. ధాన్యం కొనబోమని రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్పేందుకు కాంగ్రెస్‌ పార్టీ అధినేత చేపట్టిన రైతు సంఘర్షణ యాత్రలో భాగంగా వరంగల్‌లో సభ నిర్వహిస్తున్నామన్నారు. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌ వేవ్‌ ఉందని ఇటీవల సర్వేల్లో వెల్లడి కావడంతో కేసీఆర్‌ వ్యూహంతోనే బండి సంజయ్‌ మహబూబ్‌నగర్‌లో పాదయాత్ర చేస్తున్నారని, కరీం నగర్‌లో ఏం పొడిచాడని అక్కడ పాదయాత్ర చేస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. కేటీఆర్‌కు మెదడు దొబ్బిందని, అందుకే టీఆర్‌ఎస్‌కు కేఏ పాల్‌, ఎంఐఎం ప్రత్యర్థులంటూ వింతగా మాట్లాడుతున్నాడన్నారు. 

రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,400 మంది రైతులు ఆత్మహత్యలు జరిగా యన్నారు. టీఆర్‌ఎస్‌ దొంగల గుంపుతో కాంగ్రెస్‌పార్టీ జతకట్టదని, ప్రశాంత్‌ కిషోర్‌ కేసీఆర్‌తో చేసుకున్న రాజకీయ వ్యూహాల ఒప్పందాన్ని రద్దు చేసుకునేం దుకే వచ్చారని అన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ తప్పిదాలను కప్పిపుచ్చు కునేందుకే రాజకీయ కుట్ర, కుతంత్రాలకు తెరలేపారని అన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు లాండ్‌, శాండ్‌, గ్రానైట్‌, మద్యం, అత్యాచారాలు, హత్యలలో ముని గి తేలుతున్నారని అన్నారు. గ్రానైట్‌ అక్రమాలపై కేంద్రానికి ఫిర్యాదు చేసిన బండి సంజయ్‌ నాలుగు రాళ్లు వెనక పడగానే మిన్నకుండిపోయారని విమర్శిం చారు. కాంగ్రెస్‌ పార్టీకి 42 లక్షల ప్రాథమిక సభ్యత్వం ఉందని, 34,682 బూత్‌లలో కార్యకర్తలు రైతులు వరంగల్‌ సభకు కదిలేలా చూడాలని అన్నారు. 

 రైతుల సమస్యలపై పోరాటానికి తరలిరావాలని చైతన్యవంతులను చేస్తే సరిపోతుందని పార్టీ నాయకులకు సూచించారు. ఈ సభకు ఉద్య మంలా అన్నివర్గాల ప్రజలు తరలివచ్చి రైతు, ప్రజా వ్యతిరేక సీఎం కేసీ ఆర్‌ను పాతాళానికి తొక్కేలా చేయాలని పిలుపునిచ్చారు. 2004, 2008లో కేసీఆర్‌కు జిల్లా ప్రజలు ఎలా రాజకీయ భిక్ష పెట్టారో నేడు రైతు సమస్య లపై పోరాటం చేస్తున్న కాంగ్రెస్‌పార్టీకి సహకారాన్ని అందించాలని జోలెపట్టి అడుగుతున్నానని అన్నారు. సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌కుమార్‌యాదవ్‌, జిల్లా ఇన్‌చార్జి షబ్బీర్‌అలీ, ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే డి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారా యణ, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, ఆది శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నరెడ్డి పాల్గొన్నారు. 

  అనంతరం డీసీసీ కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ప్రతి మండలం, బూత్‌స్థాయి నుంచి నాయకులు, కార్య కర్తలు సైనికుల వలె పనిచేసి రైతులు, ప్రజలను వరంగల్‌ సభకు తరలించాలన్నారు. ప్రతి మండలం నుంచి ఐదు వేల మందిని తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. నియోజకవర్గ, మండల బాధ్యులు చురుకుగా పని చేయాలన్నారు. 


కాంగ్రెస్‌ హయాంలోనే సాగునీటి ప్రాజెక్టులు : సీఎల్పీ నేత బట్టి విక్రమార్క


ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ హయాంలోనే దేశంలో సాగు నీటి ప్రాజెక్టులు నిర్మించిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వాలకు దక్కిందని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు. ఆయన సోమవారం డీసీసీ కార్యా లయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్‌పార్టీ హయాంలోనే వ్యవసాయ రాయితీలు కల్పించి వ్యవసాయ ఉత్పత్తులను పెంచామన్నారు. రాహుల్‌ గాందీ వరంగల్‌ సభ నుంచి దేశానికే దశ, దిశ నిర్దేశం చేయనున్నారని, ఈ సభకు ఉమ్మడి జిల్లా నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావాలని కోరారు.


  రాహుల్‌ గాందీ చేపట్టిన రైతు సంఘర్ష యాత్రలో భాగంగా వరంగల్‌లో మే 6న జరిగే సభకు ప్రజలు అత్యధికంగా తరలిరావాలని ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి పిలుపునిచ్చారు. 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, ఇందులో రైతులే కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. రైతు సమస్యలపై నిర్వహిస్తున్న రాహుల్‌ గాంధీ సభకు పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజలు తరలిరావాలన్నారు. జిల్లా ఇన్‌చార్జి షబీర్‌ అలీ మాట్లాడుతూ రైతు సమస్యలు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌ అమలు కోసం కాంగ్రెస్‌పార్టీ పోరాటం చేస్తుందన్నారు. కరీంనగర్‌లో కార్యకర్తల జోష్‌ చూస్తుంటే రాష్ట్రంలో అధికారం ఖాయంగా కనపడుతుందన్నారు. 

Updated Date - 2022-04-26T05:54:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising