ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రొఫెసర్‌ జయశంకర్‌ సేవలు చిరస్మరణీయం

ABN, First Publish Date - 2022-06-22T06:16:19+05:30

ఫ్రోఫెసర్‌ జయశంకర్‌ సేవలు చిరస్మరణీయమని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు అన్నారు.

జయశంకర్‌కు నివాళులర్పిస్తున్న మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- వర్ధంతి సభలో మంత్రి హరీష్‌రావు 

పెద్దపల్లి టౌన్‌, జూన్‌ 21: ఫ్రోఫెసర్‌ జయశంకర్‌ సేవలు చిరస్మరణీయమని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు అన్నారు. జయశంకర్‌ వర్ధంతి పురస్కరించుకొని మంగళవారం స్థానిక బస్టాండ్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో ఆయన చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం హరీష్‌రా వు మాట్లాడారు. తెలంగాణ సాధనలో కేసీఆర్‌ గురువు గా వ్యవహరించి ఎన్నో నిరసనలకు రూపకల్పన చేశా డన్నారు. తొలి దశ నుంచి మలిదశ వరకు ఉద్యమాన్ని సజీవంగా ఉంచాడని ఆయన పేర్కొన్నారు. ఎందరో మేధావుల ఉద్యోగులను ఎకతాటిపైకి తెచ్చి ఉద్యమా నికి ఉపిరి పోశాడని ఆయన వివరించారు. తెలంగాణ ఏర్పాటు ఎందుకు చేయాలో శ్రీకృష్ణ కమిటీకి వివరిం చిన మహానీయుడని కొనియాడారు. కేసీఆర్‌కు వెన్ను దన్నుగా ఉంటూ తెలంగాణ ప్రకటన ప్రకటించేలా కృషి చేశాడన్నారు. నీళ్లు, నియామకాలు, నిధులు అనే ఆయన కలను కేసీఆర్‌ సార్థకత్వం చేస్తున్నాడని వివ రించారు. జయశంకర్‌ ఆశయలకు అనుగునంగా యు వత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎంపీ వెంకటేష్‌నేత, ఎమ్మెల్యే దాసరి మనోహరెడ్డి, చైర్‌పర్సన్‌ మమతారెడ్డి, రఘువీర్‌ సింగ్‌, బండారి శ్రీనివాస్‌, మర్కు లక్ష్మన్‌, కొంకటి లింగమూర్తి, ఉప్పు రాజుకుమార్‌, ఉపు కృష్ణమూర్తి, ఉప్పు రాజు,  వంగళ తిరుపతిరెడ్డి, తాళ్ళ కళ్యాన్‌  తదితరులున్నారు. అలాగే స్థానిక ప్రెస్‌క్లబ్‌లో విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో జయశంకర్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా అఽధ్యక్షుడు భీమోజు సురేందర్‌ మాట్లాడుతూ తెలంగాణ జయశంకర్‌ సార్‌ ఎన లేని సాహ సాలు, సేవలు అం దించాడన్నారు. ఈ కార్యక్రమంలో కట్ట రమేష్‌, రామోజు నర్సింహా, రమేష్‌, మణిక్యాచారి, శ్రీని వాస్‌,  కోటయ్య, సదనాందం, రవి, భాస్కర్‌ తదితరు లు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-22T06:16:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising