ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఏం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

ABN, First Publish Date - 2022-07-21T06:56:08+05:30

సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను వెంటనే అమలు పర్చాలని కోరుతూ వీఆర్‌ఏల సంఘ జేఏసీ జిల్లా శాఖ బాధ్యు లు డిమాండ్‌ చేశారు.

కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట రిలే దీక్షలో పాల్గొన్న వీఆర్‌ఏలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పే స్కేల్‌ జీవోను తక్షణమే అమలు చేయాలి 

వీఆర్‌ఏల జేఏసీ జిల్లా శాఖ డిమాండ్‌ 

జగిత్యాల అర్బన్‌, జూలై 20: సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను వెంటనే అమలు పర్చాలని కోరుతూ వీఆర్‌ఏల సంఘ జేఏసీ జిల్లా శాఖ బాధ్యు లు డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని స్థానిక కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట తమ డిమాండ్ల సాధనకు మూడు రోజుల పాటు రిలే దీక్ష చేప ట్టనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పే స్కేల్‌ జీవోను తక్ష ణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. నూతన రెవెన్యూ చట్టం -2020ని ప్రవేశపెట్టిన రోజే వీఆర్‌ఏలకు అసెంబ్లీ సాక్షిగా పే స్కేల్‌ ప్రక టించిన సీఎం కేసీఆర్‌ సుమారు 20 నెలలు గడిచిన ఇచ్చిన హామిని అ మలు చేయకపోవడం దురదృష్టకరం అన్నారు. వీఆర్‌వో వ్యవస్థ రద్దు అ నంతరం తమకున్న పదోన్నతి అవకాశం కూడా చేజారిపోయిందన్నారు.  చాలీచాలని వేతనంతో ఆర్థిక, మానసిక ఇబ్బందులు పడుతున్నామని ఆ వేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ ప్రకటించిన పే స్కేల్‌ జీవోను విడుదల చేయాలని, 55 ఏళ్లు దాటిన వీఆర్‌ఏల వారసులకు ఉ ద్యోగాలు కల్పించాలని, అర్హత కలిగిన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌ఏల జేఏసీ జిల్లా ఛైర్మెన్‌ ద్యా గల గంగారాం, కో-ఛైర్మెన్‌ సుంకం తిరుపతి, సెక్రెటరీ జనరల్‌ తుమ్మల నాగరాజు, కోశాధికారులు కోమల్ల శంకర్‌, పంగ రాజేశం, కో కన్వీనర్‌లు భూపెల్లి శంకర్‌, పత్తిరెడ్డి గంగారెడ్డి, ఎండీ సల్మాన్‌, వీరయ్య, భైనవేణి మురళి, సుధాకర్‌, సతీష్‌, రెంటం వెంకటేష్‌తో పాటు జిల్లాలోని ఆయా మండలాల్లోని వీఆర్‌ఏలు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-21T06:56:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising