ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగిత్యాల పట్టణ అభివృద్ధే లక్ష్యం

ABN, First Publish Date - 2022-09-29T06:23:09+05:30

జగిత్యాల పట్టణ అభివృద్దే ప్రధాన లక్ష్యమని బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి అన్నారు. బల్దియా సమావేశ మందిరంలో బుధవారం చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి అధ్యక్షతన సాధారణ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు.

సమావేశంలో మాట్లాడుతున్న చైర్‌ పర్సన్‌ శ్రావణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జగిత్యాల చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి 

జగిత్యాల టౌన్‌, సెప్టెంబరు 28 : జగిత్యాల పట్టణ అభివృద్దే ప్రధాన లక్ష్యమని బల్దియా చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి అన్నారు. బల్దియా సమావేశ మందిరంలో బుధవారం చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి అధ్యక్షతన సాధారణ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. 27 అంశాలపై కౌన్సిల్‌ సభ్యులు సుదీర్ఘంగా చర్చించి ఆమోదించారు. కాంగ్రెస్‌, బీజేపీ, ఇండిపెండెంట్‌ కౌన్సిలర్లతో పాటు పలువురు అధికార పార్టీ కౌన్సిలర్లు తమ సమస్యలను సభా దృష్టికి తీసుకరాగా సమ స్యలను వెంటనే పరిష్కరించాలని చైర్‌ పర్సన్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న బతు కమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు 4, 5, 11 వార్డుల్లో ఉన్న బతుకమ్మ ఘాట్ల వద్ద బతుకమ్మ విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు  రూ. 2.60 లక్షల నిధులు కేటాయించేలా కౌన్సిల్‌ సభ్యులు తీర్మానించారు. పట్టణంలో రానున్న మిలాద్‌ ఉన్‌ నబీ పండుగ సందర్భంగా అక్టోబరు 7వ తేది నుండి 10 వ తేదీ వరకు గల నాలుగు రోజులు ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేక లైట్లు వేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కమిషనర్‌ గంగాధర్‌, వైస్‌ చైర్మన్‌ గోళి శ్రీనివాస్‌, డీఈ రాజేశ్వర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-09-29T06:23:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising