ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్వాసితుల సమస్యలపై ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి లేదు

ABN, First Publish Date - 2022-05-29T05:34:59+05:30

నిర్వాసితుల సమస్యలపై మంథని ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి లేదని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు ఆరోపించారు.

విలేకరులతో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు

రామగిరి, మే 28: నిర్వాసితుల సమస్యలపై మంథని ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి లేదని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు ఆరోపించారు. శనివారం రామగిరి అతిథిగృహంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్వాసితుల సమస్యలపై కలెక్టర్‌ దేవసేనకు సిఫారసు చేశానని ఎమ్మెల్యే అంటున్నారని, 2020 ఫిబ్రవరి నెలలో దేవసేన బదిలీ వెళ్లారని పేర్కొన్నారు. గత రెండేళ్లలో నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ఏచర్యలు తీసుకున్నారో స్పష్టం చేయాలన్నారు. నిర్వాసితుల ఆర్‌అండ్‌ ఆర్‌పై ఎమ్మెల్యేకు పరిజ్ఞానం లేదన్నారు. లద్నాపూర్‌ గ్రామానికి చెందిన 283 మంది కి ఏం న్యాయం చేస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీపై చిత్త శుద్ధి ఉంటే ఇన్ని సంవత్సరాలుగా అధికారులపై ఒత్తిడి ఎందుకు తేలేదని ప్రశ్నించా రు. ఈ సమావేశంలో జడ్పీటీసీ మ్యాదరవేని శారద, ఎంపీపీ ఆరెల్లి దేవక్క, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పూదరి సత్యనారాయణగౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శంకేషి రవీందర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-29T05:34:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising