ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరితహారం విజయవంతం చేయాలి

ABN, First Publish Date - 2022-06-28T06:40:52+05:30

ఎనిమిదవ విడత హరితహా రం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా గ్రామీ ణాభివృద్ధి అధికారి శ్రీధర్‌ ప్రజా ప్రతినిధులు, అధికా రులకు సూచించారు.

గర్రెపల్లిలో మొక్కలు నాటుతున్న డీఆర్‌డీఓ శ్రీధర్‌, ఎంపీపీ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- డీఆర్‌డీఓ శ్రీధర్‌ 

సుల్తానాబాద్‌, జూన్‌ 27: ఎనిమిదవ విడత హరితహా రం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా గ్రామీ ణాభివృద్ధి అధికారి శ్రీధర్‌ ప్రజా ప్రతినిధులు,  అధికా రులకు సూచించారు. మండలంలోని గర్రెపల్లి గ్రామంలో హరితహారం పథకం ప్రారంభం కోసం చేస్తున్న ఏర్పాట్లను ఆయన సోమవారం ఎంపీపీ బాలాజీరావుతో కలసి పరిశీ లించారు. గర్రెపల్లి సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యా లయంలో ఏర్పాటు చేస్తున్న బృహత్‌పల్లె ప్రకృతి వనంను అయన సందర్శించారు.  సర్పంచ్‌ వీరగోని సుజాత ఎంపీపీ బాలాజీరావుతో కలసి అక్కడ మొక్కలు నాటారు. ఈ సంద ర్భంగా డీఆర్‌డీఓ శ్రీదర్‌ మాట్లాడుతూ ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 13 మం డలాల్లో ఈ ఏడాది 23 లక్షల 51 వేల మొక్కలు నాటేం దుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ లక్ష్య సాధన  కోసం గత పది పదిహేను రోజులుగా అన్ని మండలాల్లో రోడ్ల పక్కన మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వే పనులు కొనసాగుతున్నాయని అన్నారు. అందరూ సమన్వయంతో పని చేసి లక్ష్యం చేరుకోవాలన్నారు. హరితహారం విజయ వంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శశికళ,  ఎంపీటీసీ పులి అనూష, ఉప సర్పంచ్‌ మదుకర్‌, కార్యదర్శి ప్రశాంత్‌, పీఆర్‌ ఏఈ సతీష్‌, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ అరుణ శ్రీ, ఈజీఎస్‌ ఏపీఓ లావణ్య, ఏఈ రాజ్‌కుమార్‌, టీఏ జీవన్‌రెడ్డి తదితరలు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-28T06:40:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising