ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యావిధానంపై ప్రభుత్వానికి స్పష్టత లేదు

ABN, First Publish Date - 2022-11-28T01:29:48+05:30

రాష్ట్రంలో విద్యావిధానంపై ప్రభు త్వానికి స్పష్టత లేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు.

సమావేశంలో మాట్లాడుతున్న జీవన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

జగిత్యాల అర్బన్‌, నవంబరు 27: రాష్ట్రంలో విద్యావిధానంపై ప్రభు త్వానికి స్పష్టత లేదని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రం లో స్టేట్‌ టీచర్స్‌ యూనియన్‌ టీఎస్‌ (ఎస్టీయూ) ఉపాధ్యాయ సంఘం 75 వసంతాల వజ్రోత్సవాల్లో జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో పా టు, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత, బల్దియా చైర్‌పర్సన్‌ బోగ శ్రావణి, సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సదానంద్‌ గౌడ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్య మంలో ఉద్యోగులు, ఉపాధ్యా యులు, విద్యార్థుల పాత్ర మరువలేమన్నారు. సమాజంలో విద్యావిధానం అన్నిటికన్నా ప్రధానమని, అయితే ఉమ్మడి రాష్ట్రం కన్నా, స్వరాష్ట్రంలో ప్ర భుత్వ పాఠశాలలు ఏ మేరకు బలోపేతం అయ్యాయో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వానికి విద్యావి ధానంపై స్పష్టత ఉన్నపుడే బలోపేతం సాధ్యం అవుతుందన్నారు. ప్రమోషన్‌ ప్రక్రియ పూర్తయితేనే నియామకాల ప్రక్రియ సాధ్యం అవుతుందనే కనీస ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరం అన్నారు. బదిలీలు, ప్రమోషన్లలో జాప్యం, నూతన జోనల్‌ విఽధానం, జీవో నెం, 317, స్పౌస్‌ బదిలీలు ఇవన్నీటితో ఉ ద్యోగ, ఉపాధ్యాయులు సమస్యలు ఎదుర్కుంటున్నారన్నారు. ‘మనఊరు- మనబడి’ గొప్ప కార్యక్రమం అయినా అది ఎక్కడ అమలవుతుందో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ విద్య అమలు అగమ్యగోచరంగా మారిందని, విద్యావలంటీర్‌ వ్యవస్థను తొలగించడం బాధాకరం అన్నారు. రాష్ట్రంలో ఇంత లోపభూయిష్టంగా విధానం కొనసా గుతుంటే, ఉపాధ్యాయులపై చర్యలకు టీమ్‌లు ఏర్పాటు చేయడం విద్యా వ్యవస్థ పట్ల ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అన్నారు. సీపీఎస్‌ నుంచి ఓపీఎస్‌ విధానంలోకి మార్చడం ద్వారా ప్రభుత్వంపై అత్యవసరంగా పడే భారం ఏం లేదన్నారు. విధ్యావిధానం పట్ల ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తానని హామీ ఇచ్చారు. అనంతరం జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థ పటిష్టత దిశగా చర్యలు గై కొంటుందన్నారు. జిల్లాలో జడ్పీ జీపీఎఫ్‌ లావాదేవీలు జిల్లా కేంద్రంలోనే ప్రారంభం అవుతాయన్నారు. దీని కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయబోతున్నట్లు ఆమె పేర్కొన్నారు. బల్దియా చైర్‌పర్సన్‌ శ్రావణి మా ట్లాడుతూ విద్యా, వైద్యం మెరుగుపర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సదానం ద్‌గౌ డ్‌, జిల్లా అధ్యక్షుడు భైరం హరికిరణ్‌, ప్రధాన కార్యదర్శి మచ్చ శంకర్‌, బాధ్యులు మేకల ప్రవీణ్‌, భూమయ్య, రాజన్న, రవి, తిరుపతి రెడ్డితో పా టు అన్ని మండల శాఖల అధ్యక్ష, కార్యదర్శులు, జిల్లా బాధ్యులు ఉపాధ్యాయులున్నారు.

Updated Date - 2022-11-28T01:29:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising