ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరంతర కృషితో లక్ష్యాన్ని సాధించాలి

ABN, First Publish Date - 2022-05-29T05:34:26+05:30

పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర కృషితో యువత అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గొల్లపల్లి చంద్రశేఖర్‌ గౌడ్‌ అన్నారు.

మాట్లాడుతున్న ఆర్డీవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రశేఖర్‌ గౌడ్‌

జగిత్యాల, మే 28 (ఆన్‌లైన్‌): పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర కృషితో యువత అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ గొల్లపల్లి చంద్రశేఖర్‌ గౌడ్‌ అన్నారు. శనివారం పట్టణంలోని ప్రధాన లైబ్రరీలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆద్వర్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువకులు, విద్యార్థులకు అవగాహణ సదస్సును నిర్వ హించారు. ఈసందర్బంగా చంద్రశేఖర్‌ గౌడ్‌ మాట్లాడారు. తల్లిదండ్రులు కన్న కలలను సాకారం చేసే దిశగా యువత కృషి చేయాలన్నారు. అం దుకు గ్రంథాలయాలను కేంద్రంగా చేసుకోవాలన్నారు. గ్రంథాలయాలు వి జ్ఞాన కేంద్రాలుగా సహకారాలు అందిస్తాయన్నారు. గ్రంథాలయాల్లో అవ సరమైన మౌలిక వసతులు, పుస్తకాలు అందుబాటులో ఉంచుతు న్నామ న్నారు. కష్టపడి చదివి ఉద్యోగం సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలని సూచించారు. శ్రమ ఆయుదమైతే విజయం మీ బా నిస అవుతుందని తెలిపారు. జగిత్యాల ఆర్డీవో మాదురి మాట్లాడుతూ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ప్రణాళికతో చదువుకోవాలన్నారు. ఎన్ని గంటలు చదవాలి, స్మార్ట్‌ స్టడీ ఎలా చేయాలి, పాజిటివ్‌ నోట్స్‌ ఎలా రాయాలి అన్న పలు అంశాలపై వివరించారు. సెల్‌ఫోన్‌, వినోదాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కో ఆర్డినేటర్‌ లక్ష్మీరాజం, లైబ్రరీయన్‌ శకుంతల, పలువురు యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-29T05:34:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising