ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గడపగడపకూ రైతు డిక్లరేషన్‌ను తీసుకెళ్లాలి

ABN, First Publish Date - 2022-05-24T05:48:46+05:30

రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను పల్లెపల్లెకు.. గడపగడపకూ తీసుకెళ్లాలని పెద్దపల్లి మాజీ ఎమ్మె ల్యే విజయరమణరావు అన్నారు.

తొగర్రాయి రచ్చబండలో మాట్లాడుతున్న విజయరమణారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మాజీ ఎమ్మెల్యే విజయరమణరావు

- తొగర్రాయిలో కాంగ్రెస్‌ రచ్చబండ ప్రారంభం

సుల్తానాబాద్‌, మే 23: రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను పల్లెపల్లెకు.. గడపగడపకూ తీసుకెళ్లాలని పెద్దపల్లి మాజీ ఎమ్మె ల్యే విజయరమణరావు అన్నారు. మండలంలోని తొగర్రాయిలో సోమవారం రచ్చ బండ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గ్రామస్థులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆయన చర్చించారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ రైతు డిక్లరేషన్‌ గురించి కార్యకర్తలు, నాయకులు విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వెంటనే రైతులకు రెండు లక్షల రుణ మాఫీ చేస్తామని, ఇందిరమ్మ రైతు భరోసా పేరిట భూమి ఉన్న రైతులతో పాటు ఇతర కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని, భూమిలేని ఉపాధిహామీ కూలీలకు ఏడాదికి రూ.12వేలు ఇస్తామన్నారు. ఇలా వరంగల్‌ సభలో రాహుల్‌గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ కు సంబంధించిన వివరాలను ఆయన ప్రజలు, రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య, అంతటి అన్న య్య, జడ్పీటీసీ సభ్యురాలు మినుపాల స్వరూపప్రకాష్‌రావు, మండల అధ్యక్షుడు చిలుక సతీష్‌, దామోదర్‌రావు, పట్టణ అధ్యక్షుడు వేగోళం అబ్బయ్య గౌడ్‌, రైతు సంఘం అధ్యక్షుడు పన్నాల రాములు, ఎంపీటీసీ మీస లక్ష్మీసత్యనారాయణ తదిత రులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T05:48:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising