రాజ్యాధికారంతోనే బలహీనవర్గాల అభివృద్ధి సాధ్యం
ABN, First Publish Date - 2022-10-07T05:41:14+05:30
బడుగు బలహీన వర్గాల అభివృద్ధి రాజ్యాధికారంతోనే సాధ్యమని దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర అధ్యక్షుడు డా. విశారదన్ మహరాజ్ అన్నారు.
- డీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్
కోనరావుపేట. అక్టోబరు 6: బడుగు బలహీన వర్గాల అభివృద్ధి రాజ్యాధికారంతోనే సాధ్యమని దళిత శక్తి ప్రోగ్రాం రాష్ట్ర అధ్యక్షుడు డా. విశారదన్ మహరాజ్ అన్నారు. పదివేల కిలోమీటర్ల స్వరాజ్యా పాదయాత్ర మండలంలోని కోలనూర్, మర్దన్‌పేటలో గురువారం కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో డీఎస్పీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. దళితల బతుకులు మారాలాంటే రాజ్యాధికారం రావాలని అన్నారు. ఇందుకోసం దళతులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎస్పీ నాయకులు హరిష్‌గౌడ్, బీమ్ ప్రకాష్, బీమ్ కీర్తన, అరుణ్, కృష్ణ, అనిల్, మనోజ్, ఇసాక్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-07T05:41:14+05:30 IST