ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్‌ పాలనకు చరమగీతంపాడాలి

ABN, First Publish Date - 2022-01-22T05:51:36+05:30

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పాలనకు చరమగీతంపాడాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేకానంద పిలుపు నిచ్చారు.

సమావేశంలో మాట్లాడుతున్న వివేకానంద
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేకానంద 

ధర్మపురి, జనవరి 21: రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పాలనకు చరమగీతంపాడాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేకానంద పిలుపు నిచ్చారు. ధర్మపురి పట్టణంలోని పటేల్‌ గార్డెన్స్‌లో నియోజకవర్గ స్థాయి బీజేపీ కార్యకర్తల సమావేశం శుక్రవారం జరి గింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన వివేకానంద మా ట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తరువాత అధికారం చేజిక్కించుకున్న సీఎం కేసీఆర్‌ హయంలో అవినీతి, దోపిడీ పెరిగి పోయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ భగీరథ లాంటి ప్రాజెక్టు పనులు ఆంధ్రా ప్రాంతానికి చెందిన మెగా క్రిష్ణారెడ్డికి అప్పగించి వందలాది కోట్లు నిధులు దోచు కుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులకు రుణ మాఫీ, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, దళితబంధు పథకాల పేరుతో ప్రజలను దగా చేశాడని ఆయన దుయ్యబట్టారు. రైతులు విక్రయించిన వరి ధాన్యానికి నేటికి సరిగా డ బ్బులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. రా ష్ట్రంలో తుగ్లక్‌ పాలన నడుస్తోందని, బీజేపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేస్తే భయపడేది లేదని ఆయన అన్నారు. ఈ సమా వేశంలో బీజేపీ ధర్మపురి, బుగ్గారం, వెల్గటూర్‌, పెగడపల్లి, ధర్మారం మండల శాఖల అధ్యక్షులు గంగారం, పరుశురాములు, చక్రపాణి, కొ మురవెల్లి, తిరుపతిరెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కరండ్ల మదు కర్‌, జిల్లా ఉపాధ్యక్షులు గాజుల మల్లేశం, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌, కి సాన్‌ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మణ్‌, దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్‌, పట్టణ అధ్యక్షులు బెజ్జారపు లవణ్‌కుమార్‌, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

ఫధర్మపురి మండలంలోని పలు గ్రామాల్లో వివేకానంద శుక్రవారం పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఆయన బీజేపీ జెండాను ఎగుర వేశా రు. గ్రామాల్లో కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి, పూల మాలలు వేసి సన్మానించారు.  


Updated Date - 2022-01-22T05:51:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising