ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం సభను విజయవంతం చేయాలి

ABN, First Publish Date - 2022-08-28T05:32:57+05:30

పెద్దపల్లి జిల్లాకేంద్రంలో 29న నిర్వహించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగ సభకు కరీంనగర్‌ నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళ్లి విజయవంతం చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ప్రజలకు విజ్ఞప్తిచేశారు.

మేయర్‌ సునీల్‌రావు, కార్పొరేటర్లతో చర్చిస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  మంత్రి గంగుల కమలాకర్‌ 

కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 27: పెద్దపల్లి జిల్లాకేంద్రంలో  29న నిర్వహించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగ సభకు కరీంనగర్‌ నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళ్లి విజయవంతం చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ప్రజలకు విజ్ఞప్తిచేశారు. శనివారం కరీంనగర్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మేయర్‌ యాదగిరి సునీల్‌రావుతో కలిసి కార్పొరేటర్లు, కో ఆప్షన్‌ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ పెద్దపల్లిలో సోమవారం లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీఆర్‌ఎస్‌శ్రేణులు, అభిమానులను, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలించాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా కేంద్రానికి తొలిసారిగా సీఎం కేసీఆర్‌  వస్తున్నందున టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులు హాజరై సీఎం కేసీఆర్‌కు అండగా నిలువాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి హరిశంకర్‌, కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రెడ్డవేని మధు, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్‌, మాజీ జడ్పీకో అప్షన్‌ సభ్యుడు జమీలొద్దీన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-28T05:32:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising