ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళిత కుటుంబాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ ధ్యేయం

ABN, First Publish Date - 2022-01-29T06:16:52+05:30

దళిత కుటుంబాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. వీర్నపల్లి మండలం రంగంపేటలో దళితబంధు పథకంపై శుక్రవారం అవగాహన, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

వీర్నపల్లి, జనవరి 28ః దళిత కుటుంబాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ ధ్యేయమని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. వీర్నపల్లి మండలం రంగంపేటలో దళితబంధు పథకంపై శుక్రవారం అవగాహన, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి మాట్లాడుతూ గ్రామంలో 22 మంది లబ్ధిదారులను చేసినట్లు చెప్పారు.  ఆ కుటుంబాలు దళితబంధు పథకం ద్వారా ఉపాధి పొందడంతోపాటు నలుగురికి ఉపాధి కల్పించాలని సూచించారు. జీవన ప్రమాణాలు మెరుగు పర్చేందుకు పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఆర్థికంగా ఎదిగి ఇతరులకు ఆదర్శంగా నిలిచేలా మార్గం ఎన్నుకోవాలని సూచించారు. దళితబంధు పథకం కింద అందించే రూ.10 లక్షలతో ఏ వ్యాపారాలు ప్రారంభిస్తారో లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. తరతరాలు ఉపాధి పొందే అవకాశాలు కల్గిన వ్యాపారాలను ఎంచుకోవాలన్నారు.  దళితబంధుతో దళితులు ధనికులు కావాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ సత్యప్రసాద్‌, డీఆర్డీవో కౌటల్యరెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్‌రావు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ వినోద్‌కుమార్‌, పరిశ్రమల శాఖ జీఎం ఉపేందర్‌రావు, ఉద్యాన శాఖ జిల్లా అధికారి జ్యోతి, సర్పంచ్‌ లింగం, ఎంపీపీ భూల, జడ్పీటీసీ కళావతి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి రణధీర్‌రెడ్డి, డీటీవో కొండల్‌రావు, తహసీల్దార్‌ తఫజుల్‌హుస్సేన్‌, ఎంపీడీవో భారతి, ఎంపీవో నవీన్‌, ఏవో భూమిరెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు లక్ష్మీరాజం, నాయకులు సురేశ్‌నాయక్‌, సంతోష్‌నాయక్‌, హన్మండ్లు, బుగ్గయ్య, ఉస్మాన్‌నాయక్‌   పాల్గొన్నారు.

Updated Date - 2022-01-29T06:16:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising