ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంతంగా ముగిసిన పది పరీక్షలు

ABN, First Publish Date - 2022-05-29T05:39:09+05:30

జిల్లాలో పదోతరగతి పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో మొత్తం 6,381 మంది విద్యార్థులు ఉండగా వారి కోసం జిల్లాలో 35 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

పరీక్షా కేంద్రం నుంచి బయటకు వస్తున్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జిల్లాలో 40 మంది విద్యార్థుల గైర్హాజరు

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌, మే 28: జిల్లాలో పదోతరగతి పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో మొత్తం 6,381 మంది విద్యార్థులు ఉండగా వారి కోసం జిల్లాలో 35 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. శనివారం 6,341 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 40 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ప్రైవేట్‌ విద్యార్థులు ముగ్గురు ఉండగా ఎవరూ గైర్హాజరు కాలేదు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతి పరీక్షా కేంద్రంలో ఫ్యాన్‌లు, విద్యుత్‌ సరఫరా నిలిచిపోకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఆరోగ్య సిబ్బందిని నియమించారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్‌ సెంటర్‌లను మూసి ఉంచడంతో పాటు 144 సెక్షన్‌ను అమలు చేశారు. ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించడానికి కృషి చేసిన జిల్లా పరీక్షల విభాగం అధికారి, సీఎస్‌, డీవోలతో పాటు ఇన్విజిలేటర్లను జిల్లా విద్యాధికారి రాధాకిషన్‌ అభినందించారు. 


Updated Date - 2022-05-29T05:39:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising