ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగ్గాసాగర్‌ పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిలిపివేత

ABN, First Publish Date - 2022-07-06T06:00:58+05:30

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని జగ్గాసాగర్‌ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం అమలు కావడం లేదు. పాఠశాలలు ప్రారంభమైన నుంచి 20 రోజులుగా మధ్యాహ్న భోజనం వండటం లేదు.

ఇంటి నుండి తెచ్చుకున్న భోజనం తింటున్న విద్యార్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెట్‌పల్లి రూరల్‌, జూలై 5 : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని జగ్గాసాగర్‌ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం అమలు కావడం లేదు. పాఠశాలలు ప్రారంభమైన నుంచి 20 రోజులుగా మధ్యాహ్న భోజనం వండటం లేదు. ప్రతి రోజు విద్యార్థులు ఇంటి నుంచి భోజనం తెచ్చుకుని తింటున్నారు. పాఠశాలలో ఈ సంవత్సరం కొత్తగా 60 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోగా మొత్తం 110 మంది విద్యార్థులు ఉన్నారు. మధ్యాహ్న భోజనం అమలు గురించి ఎంఈవో భీమయ్యను అడగగా జీతాలు రావడం లేదని మధ్యాహ్న భోజన కార్మికులు విధులకు రావడం లేదని తెలిపారు. వారికి జనవరి వరకు జీతాలు చెల్లించామన్నారు. మిగిలిన మూడు నెలల జీతాల కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలిపారు. మధ్యాహ్న భోజనం తయారు చేయడానికి కొత్త వారిని చూడాలని సర్పంచు, ఎస్‌ఎమ్‌సీ చైర్మన్‌కు సూచించినట్లు తెలిపారు. త్వరలోనే కొత్త వారిని నియమించి మధ్యాహ్న భోజనం  విద్యార్థులకు అందేలా చూస్తామని పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-06T06:00:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising