ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫీవర్‌ సర్వే ద్వారా అనుమానితులను గుర్తించాలి

ABN, First Publish Date - 2022-01-19T06:51:43+05:30

జిల్లాలో ఫీవర్‌ సర్వే ద్వారా అనుమానితులను గుర్తించి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు, చికిత్స అందించా లని కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ అన్నారు.

వెబ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ రవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-  కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌

జగిత్యాల, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఫీవర్‌ సర్వే ద్వారా అనుమానితులను గుర్తించి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు, చికిత్స అందించా లని కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ అన్నారు. మంగళవారం పట్టణం లోని కలెక్టర్‌ కార్యాలయం నుంచి జూమ్‌ యాప్‌ ద్వారా సంబంధిత అ ధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్ట ర్‌ మాట్లాడారు. కొవిడ్‌ పరీక్షలు నిర్వహించడంతో పాటు బాధితులను హోం ఐసోలేషన్‌లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బాధితుల ప్రైమరీ కాంటాక్టు అయిన వారు జాగ్రత్త పడాలని సూచించారు. జి ల్లాలో కొవిడ్‌ విజృంభించకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నా రు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కూడా సజావుగా పూర్తయ్యేలా చూడాలన్నా రు. రెండవ డోస్‌ తీసుకున్న వారు 39 వారాలు లేదా 9 నెలలు పూర్త యిన ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌లకు బూస్టర్‌ డోస్‌ అందించాలని ఆదేశిం చారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు ఫీవర్‌ సర్వే సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. నిర్ధారణ పరీక్షలు అవసరము మేరకు పెంచాలని, ప్రతీ రోజు 4 వేల నిర్ధారణ పరీక్షలు నిర్వహించాల న్నారు. పండుగ సందర్భంగా ప్రజలు ప్రయాణాలు, సామూహికంగా ఉ న్నందున, ర్యాపిడ్‌, ఆర్టీపీసీర్‌ పరీక్షలను ఎక్కువ సంఖ్యలో చేయాలన్నా రు. గ్రామ, మున్సిపాల్టీలలో ఫీవర్‌ సర్వే, కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు సక్ర మంగా జరిగేలా మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీఓలు బాధ్యత వహించా లని సూచించారు. జిల్లాలో యాక్టివ్‌ కేసులను గుర్తించి హోం ఐసోలేష న్‌ వారికి సరియైన చికిత్సను అందించేలా క్షేత్ర స్థాయిలో నియమించిన సిబ్బంది పర్యవేక్షించాలన్నారు. కొవిడ్‌ కంట్రోల్‌ రూం ద్వారా ఎప్పటికప్పు డు పాజిటివ్‌ కేసులను సమీక్షించాలన్నారు. కొవిడ్‌ ప్రొటోకాల్‌ పాటించ కపోవడం, మాస్కులు ధరించకుండా ఉన్న వారిని గుర్తించి వారికి జరి మానాలను విఽధించాలని ఆదేశించారు. ఆసుపత్రులలో ఆక్సిజన్‌, జనరల్‌ బెడ్‌లు, ఐసీయూ బెడ్‌లు, వెంటిలేటర్లను అందుబాటులో ఉంచుకోవడం తో పాటు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండా లన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి పుప్పాల శ్రీధర్‌, మెడికల్‌ సూపరెండెంట్‌లు, వైద్యాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-19T06:51:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising