ఘనంగా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలు
ABN, First Publish Date - 2022-11-30T00:03:02+05:30
జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్‌లో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం సుబ్రహ్మణ్య స్వా మి షష్ఠి వేడుకలను శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
జగిత్యాల టౌన్, నవంబరు 29 : జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్‌లో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం సుబ్రహ్మణ్య స్వా మి షష్ఠి వేడుకలను శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమా ర్, మహిళా జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, బల్దియా చైర్ పర్సన్ బోగ శ్రావణి, టీపీసీసీ సభ్యుడు గిరి నాగభూషణంతో పాటు భక్తు లు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారలకు క్షీరాభిషేకం నిర్వహించి ప్ర త్యేక పూజలో పాల్గొన్నారు. ఉదయం నుంచే భక్తులు బారులు తీరడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో మార కైలాసం, కమటాల శ్రీనివాస్, చెట్ల చంధ్రశేఖర్, మర్యాల రాజన్న, మంత్రి శ్రీనివాస్, గౌరిశెట్టి చిరంజీవి, సామ పవన్, సూర రంజిత్, అరవపెల్లి రా జేందర్, గుడిసె భద్రయ్య, కోట శ్రీనివాస్, చంధ్రకాంత్ ఉన్నారు
Updated Date - 2022-11-30T00:03:04+05:30 IST